ఆ ఓటీటీ ని బ్యాన్ చేయాలంటూ నెటిజన్ల ఆగ్రహం..

ఒకప్పుడు ఎంటర్ టైన్ మెంట్ అంటే కేవలం సినిమానే. సినిమా విడుదల అయిందంటే జనాలందరూ థియేటర్ కి వెళ్ళి చూడాల్సిందే. అయితే ఇప్పుడు ఎంటర్ టైన్ మెంట్ మన చేతిలోనే దొరుకుతుంది. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు ఎంత కావాలంటే అంత ఎంటర్ టైన్ మెంట్ దొరుకుతుంది. అయితే థియేటర్లో విడుదల అయ్యే సినిమాలకి సెన్సార్ షిప్ ఉంటుంది. కానీ మన అరచేతిలో దొరికే కంటెంట్ కి మాత్రం ఎలాంటి సెన్సార్ ఉండదు. 

అదే ప్రస్తుతం అనేక వివాదాలకి దారి తీస్తుంది. థియేటర్ కి ప్రత్యామ్నాయం కాకపోయినా దాదాపుగా అదే పద్దతిలో కొనసాగుతున్న ఓటీటీలో విడుదలయ్యే కంటెంట్ పట్ల సర్వత్రా విమర్శలు ఎదురవుతున్నాయి. ఓటీటీ అంటేనే వివాదం అన్న రేంజ్ వరకీ వెళుతోంది. మొన్నటికి మొన్న అనుష్మ శర్మ నిర్మించిన పాతాల్ లోక్ సిరీస్ పై విమర్శలు వచ్చాయి. మనోభావాలు దెబ్బతిన్నాయంటూ ఓ వర్గం వారు అభ్యంతరాలు లేవనెత్తారు. 

ఇలా ఒక్క దానికే కాదు, ఓటీటీలో రిలీజ్ అవుతున్న చాలా వాటికి ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. తాజాగా తెలుగు చిత్రమైన క్రిష్ణ అండ్ హిస్ లీల చిత్రంలో హీరో పాత్ర పేరు క్రిష్ణ కాగా, అతను హీరోయిన్లతో విచ్చలవిడిగా తిరుగడం, ఆ హీరోయిన్లకి దేవతా స్త్రీలైన రాధా, సత్యభామ పేర్లని పెట్టడం వివాదాస్పదంగా మారింది. దాంతో హిందూ మతం వారి మనోభావాలు దెబ్బతింటున్నాయంటూ ఒకానొక వ్యక్తి సైబర్ క్రైమ్ కేసు పెట్టాడు. నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన ఈ చిత్రానికి సురేష్ బాబు నిర్మాతగా ఉన్నాడు.

అయితే ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ వంటి విదేశీ ఓటీటీలని బ్యాన్ చేయాలంటూ, ట్రెండ్ ని స్టార్ట్ చేసారు. హిందూ మత సాంప్రదాయాలను అగౌరవపరిచే విధంగా చూపిస్తున్నారని, అందుకే నెట్ ఫ్లిక్స్ ని బ్యాన్ చేయాలన్న డిమాండ్ పెరుగుతుంది.  

Netizens demanding to ban the OTT channel netflix..:

Netizens demanding to ban the OTT channel netflix..


LATEST NEWS