ఆహా.. తమన్నాకి గట్టిగానే ఇస్తున్నారుగా..!

ప్రస్తుతం ఓటీటీ హవా జోరుగా ఉంది. థియేటర్స్ లాక్‌డౌన్ నడుస్తుంది కాబట్టి.. అందరూ ఓటీటీల మీదే పడ్డారు. అందుకే ఇప్పుడు అందరూ ఓటీటీలను లైం టైం లోకి తేవడానికి నానా కష్టాలు పడుతున్నారు. ఓటీటీల హవా పెరుగుతుంది అనుకున్న అల్లు అరవింద్ కరోనా కన్నా ముందే ఆహా అంటూ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ని మొదలుపెట్టాడు. అయితే అమెజాన్, నెట్ ఫ్లిక్స్, హాట్ స్టార్ లాంటి వాటి ముందు ఆహా ఓటిటి ప్లాట్ ఫామ్... ఓహో అన్నట్టుగా మిగిలిపోవడంతో.. ప్రస్తుతం ఓటీటీస్ కి ఉన్న క్రేజ్‌తో అల్లు అరవింద్ ఆహా మీద క్రేజ్ తెచ్చే ప్లాన్స్ సిద్ధం చేస్తున్నాడు. దాదాపుగా 80 కోట్లు పెట్టిన అరవింద్ అండ్ బ్యాచ్ ఇంకా పెట్టుబడిని ఆహాకి ఎక్కిస్తూనే ఉన్నారు. అయినా లాభాలు మాత్రం ఇప్పుడప్పుడే వచ్చేలా కనిపించకపోవడంతో.. ఆహాని భారీగా ప్రమోట్ చెయ్యాలని డిసైడ్ అయ్యారు.

ఇప్పటికే ఆహాకి విజయ్ దేవరకొండని బ్రాండ్ అంబాసిడర్‌గా చేసిన అరవింద్.. ఇప్పుడు ఆహా ప్రమోషన్స్‌కి తమన్నాని దించుతున్నాడు. తమన్నా హోస్ట్‌గా ఆహా నుండి ఓ షో రాబోతుంది. అందులో తమన్నా హోస్ట్‌గా సెలబ్రిటీస్‌ని ప్రశ్నలడుగుతూ ఆహాని ప్రమోట్ చేస్తూ ఆ షోని ఆడిస్తుంది. అయితే తమన్నా లాంటి క్రేజీ హీరోయిన్‌ని తీసుకుని ఆహా‌ని ఆహా అన్న రేంజ్ లో ప్రమోట్ చేయించే ప్లాన్స్ లో భాగంగా తమన్నా కి భారీగానే ముట్ట జెబుతున్నారట. హీరోయిన్స్ ఆఫర్స్ తగ్గినా.. ఐటెం సాంగ్స్ తోనో మారేదన్నా అవకాశాలతోనో రెచ్చిపోతున్న తమన్నాకి ఆహా కి హోస్ట్ చేసినందుకుగాను... ఒక్కో ఎపిసోడ్ కి 8 నుండి 10 లక్షల పారితోషకం ఇవ్వబోతున్నారని టాక్. వారానికి ఓ ఎపిసోడ్ చొప్పున.. తమన్నాతో ఇలాంటి ఎపిసోడ్స్ నెలకి ఐదారు చేయించాలని చూస్తున్నారట. మరి ఆ లెక్కన నెలకు ఐదు వేసుకున్న తమన్నాకి 50 లక్షలు ముడతాయన్నమాట,. ఇక తమన్నా షో ని కేవలం ఆహా ప్లాట్‌ఫామ్ మీద నుండే కాకుండా ఓ టీవీ ఛానల్ లోను ప్రసారం చేస్తారని తెలుస్తుంది. 

Tamanna Remuneration for Show in Aha OTT:

Tamanna Gets 50 lakh for Month with OTT Aha 


LATEST NEWS