రానా, మిహీకాల మధ్య ఇంత కథ జరిగిందా?

దగ్గుబాటి వారి మోస్ట్ బ్యాచులర్ రానా ఎట్టకేలకు పెళ్లిపీటలెక్కుతున్నాడు. కరోనా లాక్ డౌన్ సమయంలో హీరోలంతా ఏదో ఒక పని మీద బిజీ గా ఉంటే రానా మాత్రం తాను ప్రేమించిన అమ్మాయి గురించి చెప్పడం, వెంటనే రోకా ఫంక్షన్ చేసుకోవడం అందరికి ఒకింత షాకిచ్చింది. ఎందుకంటే రానా ప్రేమలో ఉన్నాడనే విషయం ఎవ్వరికి తెలియదు గనక. గతంలో త్రిషతో లవ్ ఎఫ్ఫైర్ నడిపాడనే టాక్ ఉంది. కాని అందులో నిజమెంతుందో తెలియదు. అయితే తాజాగా రానా మిహీకా బజాజ్ అనే అమ్మాయిని ప్రేమించి పెళ్ళాడుతున్నా అని చెప్పడం వెంటనే ఓ శుభకార్యం జరగడం జరిగింది. ఆ తర్వాతే రానా లవర్ మిహీకా బజాజ్ బ్యాగ్రౌండ్ పై గూగుల్ లో పెద్ద సెర్చింగ్ జరిగింది. అయితే తాజాగా రానా ఫ్రెండ్ మంచు లక్ష్మి రానాని ఆన్ లైన్ ఇంటర్వ్యూ చెయ్యగా.. అందులో మిహీకాతో లవ్ ఎలా అయ్యింది.. ఎలా పెళ్లివరకు వచ్చింది వివరించాడు.

రానా తనకి మిహీకా ఎలా పరిచయం అయ్యిందో చెప్పాడు. తన బాబాయ్ వెంకటేష్ కూతురు ఆశ్రీతకి మిహీకా క్లాస్‌మేట్ అని.. ఆశ్రిత, మిహీకా మంచి ఫ్రెండ్స్ అని.. అలా మిహీకా తనకి పరిచయం ఏర్పడింది అని చెబుతున్నాడు రానా. మిహీకా ఇల్లు కూడా రానా వాళ్ళ ఇంటికి చాలా దగ్గరేనట. మిహీకా ఫ్యామిలీ, దగ్గుబాటి ఫ్యామిలీలు ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా అట. మిహీకాని చూడగానే మనసులో ముద్ర వేసింది అని.. చాలా రోజులకి మిహీకాతో ఓసారి ఫోన్ మాట్లాడి.. పర్సనల్ గా కలిసి తన ప్రేమ విషయం చెప్పగా... ముందు మిహీకా బజాజ్ షాకయినా.. తర్వాత తన ప్రేమను ఒప్పుకుంది అని చెప్పాడు. ఇక తనకు మిహీకాకి ఎంగేజ్మెంట్ అవ్వలేదని.. కేవలం రోకా ఫంక్షన్ మాత్రం జరిగింది అని చెబుతున్నాడు. ఇక మిహీకా - తన ప్రేమ ఇంట్లో చెప్పగానే ముందు షాకయినా తర్వాత సంతోషించారని, అసలు ఎప్పుడెప్పుడు పెళ్లి పై గుడ్ న్యూస్ చెబుతానా అని ఫ్యామిలీ మొత్తం ఎదురు చూస్తున్న తరుణంలో నేను ప్రేమ విషయం చెప్పగానే ఒప్పేసుకున్నారని చెబుతున్నాడు రానా.

Secrets behind Rana and Miheeka Bajal love:

Rana Daggubati revealed his Love at Manchu Lakshmi


LATEST NEWS