దర్శకుడు మారుతికి క్లారిటీ వచ్చేసింది!

అల్లు అర్జున్‌కి స్నేహితుడైన దర్శకుడు మారుతీ.. బన్నీతో సినిమా కోసం ఎప్పటినుండో కాచుకుని కూర్చున్నాడు. మారుతీ దర్శకుడిగా కెరీర్ మొదలెట్టినప్పటినుండి బన్నీ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడనే టాక్ ఉంది. ఆ మధ్యన ఎప్పుడు వాట్సప్ చాట్ లో ఉన్నామని చెప్పడంతో...బన్నీ - మారుతీ సినిమాపై మళ్లీ ఊహాగానాలు మొదలయ్యాయి. మారుతీ ‘ప్రతిరోజూ పండగే’ తర్వాత ఓ మంచి మాస్ మసాలా కథతో బన్నీ కోసం వేచి చూస్తున్నాడని.. అందుకే ఏ హీరోకి కథ వినిపించలేదని అన్నారు. మారుతీ ఎదురు చూడడమే బన్నీ ఛాన్స్ ఇవ్వాలిగా అన్నారు.

అయితే తాజాగా బన్నీ సినిమాపై దర్శకుడు మారుతీ స్పందన వేరేలా ఉందిగా అంటున్నారు. అసలు బన్నీ ప్రస్తుతం సుకుమార్ తో పుష్ప పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. ప్రస్తుత పరిస్థితులను బట్టి.. ఆ సినిమా ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు. తర్వాత వేణు శ్రీరామ్ ఐకాన్ లో నటించాలి. తర్వాత సురేందర్ రెడ్డి, త్రివిక్రమ్ సినిమాలు బన్నీ లైన్ లో పెడతాడని న్యూస్ ఉంది. అలాంటప్పుడు మారుతీ, బన్నీ కోసం వేచి చూస్తే కెరీర్ ముగిసిపోతుంది. అందుకే మారుతీ ఓ మంచి కథతో వేరే స్టార్ హీరోలను కలవాలని భావిస్తున్నాడట. ఇక బన్నీతో సినిమా లేదు ఏమి లేదు.. అసలు ఈమధ్యన ఫోన్ కూడా బన్నీతో మాట్లాడలేదని అంటున్నాడు మారుతీ.

No Allu Arjun Movie with Director Maruthi:

Director Maruthi Clarity about his next Project


LATEST NEWS