నో పెళ్ళి అంటున్న సాయి ధరమ్ తేజ్..

ఆరు వరుస ఫ్లాపుల తర్వాత చిత్రలహరి సినిమాతో హిట్ దక్కించుకుని, ఆ తర్వాత మారుతి దర్శకత్వంలో వచ్చిన ప్రతీరోజూ పండగే సినిమాతో బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సాయి ధరమ్ తేజ్, ప్రస్తుతం సోలో బ్రతుకే సో బెటరు అనే సినిమాతో మన ముందుకు వస్తున్నాడు. సుబ్బు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఎస్వీసీసీ బ్యానర్ పై బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.

క్యాచీ టైటిల్ తో సింగిల్స్ ని అట్రాక్ట్ చేసేలా ఉన్న ఈ సినిమా నుండి లేటెస్ట్ అప్డేట్ ఒకటి బయటకి వచ్చింది. థమన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా నుండీ నో పెళ్ళి అనే సాంగ్ విడుదల కానుంది. మే 25వ తేదీ ఉదయం 10గంటలకి నో పెళ్ళి అనే సాంగ్ లిరికల్ వీడియో రిలీజ్ కానుందట. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.

టాలీవుడ్ లో బ్యాచులర్స్ అందరూ ఒక్కొక్కరూ పెళ్ళిపీటలెక్కుతున్న వేళ సాయిధరమ్ తేజ్ సినిమా నుండి ఈ పాట విడుదల కావడం అందరికీ ఆసక్తిని కలిగిస్తోంది. అందుకే ఈ పాట కోసం అందరూ తెగ వెయిట్ చేస్తున్నారు. అదీగాక థమన్ మ్యూజిక్ అందించడం కూడా ఓ ప్రత్యేక కారణంగా భావిస్తున్నారు. మరి నో పెళ్ళి అనే పాట కేవలం సింగిల్స్ నే అలరిస్తుందా, లేదా పెళ్లయినవారిని ఆకట్టుకుంటుందా అనేది చూడాలి.

Sai Dharam TEj Says No pelli..:

NO pelli song will be releasing on May 25th


LATEST NEWS