థియేటర్స్‌కు మోక్షం కలిగేది ఎప్పుడంటే..!

కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో విధించిన లాక్ డౌన్‌తో యావత్ సినీ ఇండస్ట్రీ మూగబోయిన విషయం తెలిసిందే. సినిమా షూటింగ్స్, రిలీజ్‌లు, సీరియల్స్ షూటింగ్స్ జరిగి సుమారు రెండు నెలలకు పైగానే అయ్యింది. ప్రస్తుతం ఇంకా 4.0 లాక్ డౌన్‌ కొనసాగుతోంది. మళ్లీ దీనికి పొడిగింపు కూడా ఉంటుందని జూన్ మొత్తం ఉన్నా ఆశ్చర్యపోనక్కర్లేదేమోనని విశ్లేషకులు చెబుతున్నారు. ఇదే జరిగితే టాలీవుడ్‌కు భారీ నష్టమే. ఇప్పటికే కొన్ని తెలుగు ఇండస్ట్రీకి కొన్ని కోట్లు నష్టపోయింది. ఇంకా లాక్ డౌన్‌కు పొడిగింపు ఉన్నా.. లేదా షూటింగ్, థియేటర్స్‌కు సడలింపులు లేకపోతే మాత్రం ఈ దెబ్బ నుంచి టాలీవుడ్ కోలుకోవాలంటే బహుశా రెండు మూడేళ్లు పట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదేమో. 

కేసీఆర్‌ నో చెప్పారా..!?

అసలు థియేటర్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయ్..? సినిమాలు ఎప్పుడెప్పుడు రిలీజ్ చేద్దామా..? అని టాలీవుడ్ పెద్దలు, నిర్మాతలు వేచి చూస్తున్నారు. ఇలాంటి తరుణంలోనే మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ అధ్యక్షతన కీలక భేటీ జరిగింది. వాస్తవానికి ఈ భేటీతో పోస్ట్ ప్రొడక్షన్స్‌కు మాత్రమే అనుమతి లభించింది. దీనిపై అధికారిక ప్రకటన రాలేదు కానీ.. జరిగేది మాత్రం ఇదే. సీఎం కేసీఆర్‌తో తలసాని నిశితంగా చర్చించగా థియేటర్స్‌కు మాత్రం నొ చెప్పారని టాక్ నడుస్తోంది. అంతేకాదు షూటింగ్స్‌ కూడా కొన్నింటికి మాత్రమే ఇవ్వాలని భావిస్తున్నారట.

ఆగస్ట్ దాకా ఆగాల్సిందేనా..!?

అయితే సినిమా రిలీజ్‌లు మాత్రం ఇప్పట్లో కుదరదట. తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఆగస్ట్ వరకు థియేటర్లకు మోక్షం ఉండదట. ఎందుకంటే ఇప్పుడే కేసులు పెరుగుతుండటం.. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఎక్కువగా కేసులు నమోదవుతుండటంతో థియేటర్స్ ఓపెన్ చేస్తే కేసులు మరిన్ని కేసులు పెరిగే అవకాశాలున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారట. జూన్, జులై నెలల్లో కాస్త కరోనా కంట్రోల్ అయ్యే అవకాశాలున్నాయని వైద్య నిపుణులు అంచనాలు వేశారట.

పైగా కరోనా భయంతో థియేటర్స్‌కు ప్రేక్షకులు వచ్చే అవకాశాలు తక్కువే. మరోవైపు ప్రస్తుతం ఆర్టీసీ బస్సులు నడుస్తున్నట్లు సీటు మార్చి సీటులో కూర్చుకోవాల్సి ఉంటుంది. ఇలాగైతే థియేటర్స్‌కు భారీగా నష్టమే. సో.. తద్వారా టికెట్ పెంచుకోక తప్పదు. వీటన్నింటినీ పరిగణనలోనికి తీసుకుని ఫైనల్‌గా థియేటర్స్ యాజమాన్యం ఓ నివేదికతో టాలీవుడ్ పెద్దలను కలిసి అనంతరం తలసాని ఆధర్వ్యంలో సీఎం కేసీఆర్‌ను కలవనున్నారని తెలియవచ్చింది. మరి కేసీఆర్ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో ఏంటో తెలియాల్సి ఉంది.

When Did TheatresRe Open In Telugu States!:

When Did Theatres Re Open In Telugu States!  


LATEST NEWS