బన్నీ ‘పుష్ప’పై వస్తున్న పుకార్లు నిజమేనా!

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ అలియాస్ బన్నీ.. హిట్ చిత్రాల దర్శకుడు సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప’. ఇప్పటికే సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్, టైటిల్‌ను అధికారికంగా ప్రకటించేసింది చిత్రబృందం. కరోనా ఎఫెక్ట్‌తో షూటింగ్ ఆగిపోయింది కానీ.. లేకుంటే ఈపాటికే సగానికిపైగానే చిత్రీకరణ పూర్తయ్యేది. ఈ సినిమాలో బన్నీ సరసన స్టార్ హీరోయిన్‌ స్థాయికి ఎదుగుతున్న రష్మిక మందన్నా నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించి ఇదిగో సినిమా ఇలా ఉంటుందట.. ఇదిగో స్టోరీ అంటూ రకరకాల పుకార్లు షికార్లు చేశాయ్. మరోవైపు ఇదిగో విలన్.. అదుగో విలన్.. ఈ భామే ఐటం గర్ల్ అంటూ కూడా రూమర్స్ వచ్చాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వెలుగు చూసింది.

ఈ సినిమా పాన్ ఇండియా అని.. మొత్తం ఐదు భాషల్లో రిలీజ్ కానుందని ఇదివరకే చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. వాస్తవానికి బన్నీకి నార్త్‌లో మంచి క్రేజ్ ఉంది. అందుకే హిందీతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో కూడా స్వయంగా డబ్బింగ్ చెప్పాలని అనుకుంటున్నాడట. లాక్ డౌన్‌లో భాగంగా ఆయా భాషల గురించి తెలుసుకోవడానికి కసరత్తులు చేస్తున్నాడని టాక్.

ఒకవేళ ఇదే నిజమైతే బన్నీ చేసేది భగీరథ ప్రయత్నమే అని చెప్పుకోవచ్చు. హిందీ, తమిళ్ వరకు అయితే పక్కాగా బన్నీ మేనేజ్ చేయగలడు కానీ కన్నడ, మలయాళంలో ఆయన చేయలేడని ఆయన ఆత్మీయులు చెబుతున్నారు. మరి ఇందులో నిజానిజాలెంతో..? అనేది తెలియాల్సి ఉంది. కాగా ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే విషయమై హాట్ టాపిక్ నడుస్తోంది. ఇప్పటి వరకూ వచ్చిన పుకార్లకు దాదాపు ఫుల్ స్టాప్ పెట్టిన చిత్ర బృందం తాజా వ్యవహారాలపై ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి మరి.

Latest Rumours On Bunny PUSHPA Movie:

Latest Rumours On Bunny PUSHPA Movie


LATEST NEWS