Advertisement

బండ్ల వర్సెస్ హరీష్ మధ్యలో పీవీపీ ఎందుకో!?


‘గబ్బర్ సింగ్’ చిత్రం ఏ క్షణాన ఎనిమిదేళ్లు పూర్తి చేసుకుందో కానీ నాటి నుంచి నేటి వరకూ వివాదం నడుస్తూనే ఉంది. ఎనిమిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఓ పేద్ద వ్యాసమే రాసుకొచ్చిన డైరెక్టర్ హరీష్ శంకర్.. అందరి పేరునూ ప్రస్తావించి నటుడు కమ్ నిర్మాత బండ్ల గణేష్ పేరు మాత్రం అస్సలు ప్రస్తావించనే లేదు. దీంతో బండ్లకు బాగా చిర్రెత్తుకురావడంతో వరుస ట్వీట్స్ వర్షం కురిపిస్తూ వచ్చాడు. ఆ తర్వాత ఇందుకు కౌంటర్‌గా హరీష్ శంకర్ కూడా ట్వీట్ చేస్తూ వచ్చాడు. అలా ఈ ఇద్దరి మధ్య రోజురోజుకూ వివాదం ముదురుతూనే ఉంది కానీ.. ఫుల్‌స్టాప్ మాత్రం అస్సలు పడట్లేదు.

Advertisement

మధ్యలో ఎందుకొచ్చినట్లు!?

అయితే అదేదో సామెత ఉంది కదా.. దాని ప్రకారం బండ్ల వర్సెస్ హరీష్ ట్విట్టర్ వేదికగా కొట్టుకుంటుంటే మధ్యలో ప్రముఖ నిర్మాత, వైసీపీ నేత పీవీపీ (పొట్లూరి వరప్రసాద్) రంగంలోకి దిగాడు. వాస్తవానికి బండ్లకు పీవీపీకి అస్సలు పడదు. ఈ మధ్య గతంలో డబ్బుల విషయంలో పెద్ద గొడవే జరిగింది.. ఒకరిపై ఒకరు చాలెంజ్‌లు చేసుకోవడం.. ఏకంగా ఇళ్లకు వెళ్లి మరీ బెదిరించుకోవడం ఆఖరికి పోలీస్ స్టేషన్ల మెట్లెక్కడం కూడా జరిగింది. దీంతో మిత్రులుగా వీరిద్దరూ బద్ధ శత్రువులుగా మారిపోయారు. నాటి నుంచి అవకాశం వేచి చూస్తున్న పీవీపీ.. ఇప్పుడు సరిగ్గా వీరిద్దరూ కొట్టుకుంటుండగా రంగంలోకి దిగేసి చిత్ర విచిత్రాలుగా కామెంట్స్ చేయడం మొదలెట్టాడు.

బ్లేడ్ బాబు ఇకపై..!

పైనున్న అమ్మవారు కిందున్న కమ్మవారు అంటూ మా బెజవాడ గురించి బ్రహ్మాండంగా చెప్పావు హరీష్. బ్లేడ్ బాబు ఇకపై నీతో సినిమా తియ్యడట. వాడు యూట్యూబ్‌లో షార్ట్ ఫిల్మ్ కూడా తీయలేడులే. నీకైతే నేనే కాకుండా డజన్ల మంది నిర్మాతలు, మిరపకాయ (రవితేజ సినిమా)ను మించి దువ్వాడ (దువ్వాడ జగన్నాథం- అల్లు అర్జున్ మూవీ)ను దాటించే సినిమా తియ్యడానికి.. వెయిటింగ్. హరీష్ తమ్ముడు… స్టార్ట్ యువర్ కుమ్ముడుఅంటూ పీవీపీ ట్వీట్ చేశాడు. అలా ఇద్దరి మధ్య మంటలు రగులుతున్న సమయంలో అగ్గికి ఆజ్యం పోసినట్లుగా వీరిద్దరి మధ్య మళ్లీ చిచ్చుపెట్టడానికి గట్టి ప్రయత్నమే చేశాడు.

‘ఫైటే’ అక్కర్లేదు. ‘ట్వీటే’ చాలు!

అంతేకాదు..  పీవీపీ ట్వీట్స్‌కు హరీష్ శంకర్ కూడా స్పందించాడు. ‘మీ భాష, భావం రెండూ నన్ను అలరించాయి. ఓ మనిషిని చీల్చి చెండాడడానికి ‘ఫైటే’ అక్కర్లేదు. ‘ట్వీటే’ చాలు అని మీరు నిరూపించారు. మీ రేంజ్‌ను మ్యాచ్ చేయాలనే నా ప్రయత్నం. నా పనితనాన్ని గుర్తించినందుకు ధన్యవాదాలు’ అంటూ హరీష్ శంకర్ రిప్లై ఇచ్చాడు. అయితే ఇంతటితో ఈ వివాదం ఆగిపోతుందనకుంటే మరింత పెరిగింది. ఓ ఇంటర్వ్యూ వేదికగా కూడా హరీష్ శంకర్‌పై బండ్ల తిట్టిపోశాడు. అలా వీరి మధ్య రోజురోజుకూ వివాదం పెరుగుతోందో తప్ప ఇప్పట్లో ఆగేలా లేదు.

PVP enters in the war between Bandla Ganesh and Harish Shankar:

PVP enters in the war between Bandla Ganesh and Harish Shankar  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement