Advertisement

కొత్త వ్యాపారంలోకి.. యాక్టర్ చరణ్‌దీప్


‘బాహుబలి’లో కాలకేయ తమ్ముడిగా, వరుణ్ తేజ్ ‘లోఫర్’ సినిమాలో విలన్‌గా, ‘సైరా నరసింహారెడ్డి’, ‘పీఎస్వీ గరుడవేగ’, ‘కల్కి’ చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించిన చరణ్‌దీప్ సూరినేని కొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టారు. తమిళ కన్నడ చిత్రాలలోనూ ప్రతినాయక పాత్రలలో నటించారు. ఇతర భాషల నుండి కూడా చరణ్ దీప్ కి మంచి అవకాశాలు వస్తున్నాయి. అతను ఆన్‌లైన్‌ వ్యాపారంలోకి దిగారు. స్నేహితుడు సునీల్ కుమార్‌తో కలిసి ‘జస్ట్ హ్యాప్’ పేరుతో ఒక యాప్ ప్రారంభించారు. నిత్యావసర సరుకులు, కాయగూరలు, పళ్లు, పాలు, పెరుగు, చికెన్, మటన్, ఫిష్ వంటి మాంసాహార ఉత్పత్తులు... తమకు అవసరమైన వాటిని ప్రజలు ఆర్డర్ చేస్తే.... అతి తక్కువ సమయంలో ‘జస్ట్ హ్యాప్’ డోర్ డెలివరీ చేస్తుంది.

Advertisement

ఆల్రెడీ ‘జస్ట్ హ్యాప్’కి 10,000 మంది లాయల్ కస్టమర్లు ఉన్నారు. సుమారు ఏడాదిగా ప్రజలకు సేవలు అందిస్తోంది. కరోనా కాలంలో ఎటువంటి లాభాపేక్ష లేకుండా ప్రజలకు నిత్యావసరాలు, కాయగూరలను తక్కువ ధరకు అందించాలని మరిన్ని ప్రాంతాల్లో ‘జస్ట్ హ్యాప్’ సేవలను చరణ్ దీప్ విస్తరిస్తున్నారు.

హైదరాబాద్ సిటీలో బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, ఫిల్మ్ నగర్, మణికొండ, బాలానగర్, చింతల్, షాపూర్, జీడిమెట్ల, సుచిత్ర, కొంపల్లి సహా ఖమ్మంలో ‘జస్ట్ హ్యాప్’ సేవలు అందుబాటులో ఉన్నాయి. మరిన్ని ప్రాంతాల్లో యాప్ సేవలు విస్తరించడానికి చూస్తున్నారు. చరణ్ దీప్ మాట్లాడుతూ.. ‘‘ఇతర ఆన్‌లైన్ స్టోర్స్ కంటే మా యాప్‌లో ధరలు తక్కువ. ప్రతిరోజూ సరికొత్త డిస్కౌంట్స్ ఉంటాయి. ఫ్రాంచైజీ కోసం ఆసక్తి కలవారు మమ్మల్ని సంప్రదించవచ్చు’’ అని అన్నారు.

Actor Charandeep ventures into a new business:

Actor Charandeep ventures into a Just Happ Business
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement