Advertisement

బాబాయ్ మూవీలో చెర్రీ కీ రోల్!?


టాలీవుడ్ పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ‘వకీల్ సాబ్’ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ దాదాపు అయిపోవాల్సి ఉంది. కానీ కరోనా ఎఫెక్ట్‌తో ఆగిపోయింది. అయితే.. ఈ క్రమంలో తన తదుపరి సినిమాపై పవన్ దృష్టిసారించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఒకట్రెండు షాట్‌లు తీసిన క్రిష్.. సినిమాలో పాత్రధారులు, టైటిల్‌పై దృష్టి పెట్టాడట. మరీ ముఖ్యంగా ఎవర్ని ఏ పాత్ర కోసం తీసుకోవాలి..? హీరోయిన్ ఎవరు..? విలన్‌గా ఎవర్ని తీసుకోవాలని అని వెతికే పనిలో ఉన్నారట. ఈ నేపథ్యంలో ‘విరూపాక్షి’ అని అనుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇది ఎంతవరకూ నిజమో కానీ తాజాగా మాత్రం ఓ ఇంట్రెస్టింగ్.. మెగాభిమానులు ఎగిరిగంతేసే వార్త ఒక్కటి సోషళ్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది.

Advertisement

ఫ్యాన్స్‌లో ఫుల్ జోష్!

అదేమిటంటే.. పవన్-క్రిష్ కాంబోలో వస్తున్న ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్నాడట. అంటే బాబాయ్ సినిమాలో అబ్బాయ్ అన్న మాట. ఈ వార్త విన్న మెగాభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. సోషల్ మీడియా దీని తాలుకూ వార్తలను తెగ షేర్ చేస్తున్నారు. అంతేకాదు.. చెర్రీ పాత్రే సినిమాకు కీలకంగా మారుతుందట. మొదట ఎవరైనా చిన్న హీరోను పెట్టి తీద్దామనుకున్న క్రిష్‌ ఎందుకో మనసు మార్చుకున్నాడట. ఈ క్రమంలో చెర్రీ గుర్తుకు రావడం.. విషయాన్ని పవన్‌కు చెప్పడం అన్నీ అయిపోయాయట. చెర్రీని కలిసి కథ చెప్పాలని పవన్ సూచించాడట.

అటు నాన్న.. ఇటు బాబాయ్..!

అన్నీ అనుకున్నట్లు జరిగితే త్వరలోనే చెర్రీని క్రిష్‌ కలిసి స్టోరీ లైన్.. ఆ కీ రోల్ గురించి చెబుతాడట. మరోవైపు ఇప్పటికే కథ కూడా చెప్పేశాడనే వార్తలూ వస్తున్నాయి. అయితే.. మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ సినిమాలో నటించడానికే చెర్రీ నానా తంటాలు పడాల్సి వస్తోంది. మరి బాబాయ్ సినిమాలో అంటే ఇప్పట్లో కష్టమే. బహుశా వచ్చే ఏడాది సినిమా ఉంటే మాత్రం అటు నాన్నగారి ‘ఆచార్య’.. ఇటు బాబాయ్ ‘విరూపాక్షి’లో నటించడానికి అబ్బాయ్ రెడీగానే ఉంటాడు. ఆ లోపే అంటే పవన్ సినిమాలో కష్టమే. ఇందులో నిజానిజాలెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంతవరకూ వేచి చూడాల్సిందే.

Ramcharan Key Role In Babai Pawan Movie!:

Ramcharan Key Role In Babai Pawan Movie!
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement