పవన్ టచ్ చేయలేడట.. రాజమౌళి రావాల్సిందే..!?

బాలీవుడ్‌ను టచ్ చేయడానికి టాలీవుడ్ స్టార్ హీరోలు జంకుతున్నారా..? మెగాస్టార్ చిరంజీవి ‘సైరా’ ఎఫెక్ట్.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘సాహో’ ఎఫెక్ట్ స్టార్ హీరోలపై గట్టిగా పడిందా..? అంత పెద్దోళ్లే టచ్ చేసి నెగ్గలేకపోయారని.. ఇక తాము నెగ్గుతామా..? అని హీరోలు భయపడిపోతున్నారా..? పవన్ కల్యాణ్ కూడా అదే జాబితాలో చేరిపోయాడా..? అంటే తాజా పరిణామాలను.. పెద్ద ఎత్తున వస్తున్న పుకార్లను బట్టి చూస్తే ఇదే అక్షరాలా నిజమని తెలుస్తోంది. ఇంతకీ పవన్ ఆలోచన ఏంటి..? ఎందుకిలా జరుగుతోంది..? అనే విషయాలు ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.

ఇంట్రెస్టింగ్ పుకారు!?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ‘పింక్’ రీమేక్‌ ‘వకీల్ సాబ్’ మూవీతో రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు సూపర్ హిట్ చిత్రాల నిర్మాతగా పేరుగాంచిన దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఇప్పటికే దాదాపు ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తయ్యింది. ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొంటూనే డైరెక్టర్ క్రిష్ సినిమాలోనూ పవన్ నటించాడు. అయితే.. కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో షూటింగ్‌లు ఆపేయడం జరిగింది. ఒకవేళ ఈ కరోనా కాటు పడకపోయింటే దాదాపు రెండు సినిమాలు కూడా పూర్తయిపోయేవి. తాజాగా క్రిష్ మూవీకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ పుకారు షికారు చేస్తోంది. 

ప్రయోగాలన్నీ ప్లాప్!

అసలు విషయానికొస్తే.. క్రిష్ మూవీని తెలుగుతో పాటు మిగిలిన భాషలు మరీ ముఖ్యంగా బాలీవుడ్‌ దాకా తీసుకెళ్లాలని దర్శకనిర్మాతలు భావించారట. అయితే.. ఒకప్పటి పరిస్థితులు వేరు అనగా ‘బాహుబలి’, ‘కేజీఎఫ్’ సినిమాల టైమ్‌లో నడిచింది కానీ.. ఇప్పుడు అస్సలు సెట్ అవ్వట్లేదు. అందుకే బాలీవుడ్‌ దాకా వెళ్లిన ‘సైరా’, ‘సాహో’ సినిమాలు బొక్కా బోర్లా పడ్డాయి. బాలీవుడ్‌లో మోత మోగించాలని బిగ్ బీ అమితాబ్ బచ్చన్‌ను రంగంలోకి దింపినప్పటికీ అక్కడి సినీ ప్రియులు అస్సలు ఆదరించలేదు. దీంతో అంత పెద్ద వాళ్లనే లెక్కచేయనప్పుడు మనం టచ్ చేయడం అవసరమా..? అని దర్శకనిర్మాతలు, పవన్ ఆలోచనలో పడ్డారట.

నాకు ఈ ప్రయోగాలొద్దు!

పైగా.. పంతానికి పోయి రిలీజ్ చేస్తే సినిమా ఆడకపోతే పరిస్థితి ఏంటి..? చేజేతులరా పరువు తీసుకున్న వాళ్లమవుతాం కదా..? అని దర్శకనిర్మాతలకు సూచించాడట. అసలే రీ ఎంట్రీ విషయంలో ప్రపంచ వ్యాప్తంగా వీరాభిమానులు తన సినిమాలపై ఎన్నో ఆశలు, అంచనాలు పెట్టుకున్నారని అలాంటి తరుణంలో మనం ఇలాంటి ప్రయోగాలు చేయడం అస్సలు బాగోదని తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది. అంటే.. పవన్ కూడా బాలీవుడ్‌ను టచ్ చేయలేకపోతున్నాడన్న మాట. వాస్తవానికి ఇంతవరకూ పవన్ సినిమాలు బాలీవుడ్ దాకా వెళ్లి హడావుడి చేసిన దాఖలాల్లేవ్.

ఊపిరి పీల్చుకో బాలీవుడ్!

ఇక మళ్లీ బాలీవుడ్‌ను టచ్ చేయాలన్నా.. తన రికార్డులు తానే బద్దలు కొట్టుకోవాలన్నా దర్శకధీరుడు రాజమౌళి అలియాస్ జక్కన్న రంగంలోకి దిగాల్సిందే. ఇప్పటికే.. ‘బాహుబలి’ సినిమా ఎవరూ కలలో కూడా ఊహించని రీతిలో తెలుగు ఖ్యాతి కీర్తులను ప్రపంచానికి చాటిచెప్పాడు. మళ్లీ ఆయనే ‘ఆర్ఆర్ఆర్’ (రౌద్రం.. రణం.. రుధిరం) మల్టీస్టారర్‌తోనే జక్కన్న రావాల్సిందే అన్న మాట. అంతవరకూ టాలీవుడ్ సినిమాలు బాలీవుడ్ అంచుల దాకా వెళ్లడం కష్టమన్న మాట. సో.. పవన్ టచ్ చేయడానికి సాహసించట్లేదు.. జక్కన్న వచ్చేంతవరకూ ఊపిరి పీల్చుకో బాలీవుడ్.. ఆ తర్వాత సీన్ ఎలా ఉంటుందో చూద్దాం.!

Pawan Didnt Touch.. Waiting For Jakkanna!:

Pawan Didnt Touch.. Waiting For Jakkanna!  


LATEST NEWS