పవన్-హరీష్ మూవీలో అందాల రాక్షసి!

జనసేన అధినేత పవన్ కల్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు సినిమాలు షూటింగ్ కూడా షురూ అయిపోయాయి. వాటిలో ఒకటి ‘పింక్’ రీమేక్‌ ‘వకీల్ సాబ్’కు వేణు శ్రీరామ్.. మరో సినిమాకు క్రిష్ దర్శకులుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే రీమేక్ మూవీకి సంబంధించి షూటింగ్ దాదాపు అయిపోయింది. కరోనా కాటేయకపోయి ఉంటే ఈ లోపు సినిమా షూటింగ్ పూర్తిగా అయిపోయేది. కానీ.. ఈ మహమ్మారి దెబ్బకు హాలీవుడ్ మొదలుకుని టాలీవుడ్ వరకూ సినిమా షూటింగ్స్ అన్నీ ఆగిపోయాయ్. ఈ గ్యాప్‌లోనూ పుకార్లకు అస్సలు కొదువ లేకుండా పోతోంది. అదేమిటంటే.. రీమేక్, క్రిష్‌తో సినిమా అవ్వగానే పవన్‌తో సినిమా కోసం హరీష్ శంకర్ లైన్‌లో ఉన్న విషయం విదితమే. 

ఇప్పటికే కథ కహానీ వర్క్ అయిపోవడంతో హీరోయిన్‌ను వెతికే పనిలో నిమగ్నమయ్యాడట. ఈ క్రమంలో అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి అయితే పవన్‌కు సెట్ అవుతుందని భావిస్తున్నాడట. మరోవైపు శ్రుతి హాసన్ పేరు కూడా గట్టిగానే వినిపిస్తోంది. అయితే ఇద్దరిలో ఒకర్నే తీసుకుంటాడా లేకుంటే.. పవన్ డ్యూయల్ రోల్ గనుక ఇద్దర్నీ తీసుకుంటాడా..? అనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. ఇదే నిజమైతే లావణ్యకు నిజంగా గోల్డెన్ ఛాన్సే అని చెప్పుకోవాలి.

Andala Rakshasi In Pawan-Harish Movie!:

Andala Rakshasi In Pawan-Harish Movie!  


LATEST NEWS