ఇప్పుడు ఫీలైతే ఏం లాభం పాయల్..!!

పాయల్ రాజపుత్ తెలుగులో బోల్డ్ పాత్రతోనే ఎంట్రీ ఇచ్చింది. తర్వాత కూడా పాయల్ కి బోల్డ్ పాత్రలే పలకరించాయి కానీ.. నటనకు ఆస్కారం ఉన్న పాత్రే పడలేదు. RX 100 తరవాత కాస్త బెట్టు చేసిన పాయల్, చివరికి బోల్డ్ పాత్రల్తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆ పాత్రలు కాకుండా డిస్కో రాజా, వెంకిమామ సినిమాల్లోనూ పాయల్ సో సో పాత్రలే చేసింది. ఇప్పటికే వెంకిమామ లాంటి పెద్ద సినిమాలో చిన్న పాత్ర అది గ్లామర్ షో పాత్ర చేసినందుకు పాయల్ తెగ ఫీలవుతుంది. కొన్ని సినిమాల్లో చెప్పిన పాత్రకి చేసే పాత్రకి పొంతన ఉండదని.. వెంకిమామలో మరీ అలాంటి పాత్రలో నటించానంటూ ఓపెన్ గానే ఫీలవుతుంది.

ఇక తాజాగా మేనేజర్ వలన కూడా పాయల్ చాలా మోసపోయిందట. పాయల్ కి ఆఫర్స్ రాకుండా ఆమె మేనేజర్ ఆమెని నిండా ముంచేసాడని, పాయల్ దగ్గరకి వచ్చిన  దర్శకులలతో పాయల్ పెద్ద వయసు హీరోలతో నటించదు అంటూ పంపెయ్యడంతో పాయల్ అవకాశాలు పోయాయని అంటున్నారు. ఇక వెంకిమామలో చేసిన టీచర్ పాత్ర వలన తనకి యంగ్ హీరోల సినిమాల్లో అవకాశాలు రావడం లేదని.. ఇక బాలయ్య సినిమాలో పాయల్ కి ఆఫర్ వచ్చినా..పాయల్ సీనియర్ హీరో అని భయపడే ఆ ఆఫర్ ని వదులుకుందనే న్యూస్ నడుస్తుంది. మరి RX 100 తర్వాతే అన్ని చూసుకొని హీరోయిన్ పాత్రలను ఎంపిక చేసుకోవాల్సింది పోయి... వచ్చినా తింగరి చెత్త పాత్రలను చేసి ఇప్పుడు ఫీలయితే ఉపయోగం ఏమిటి అంటున్నారు.

Payal Rajput not happy with Movie Offers:

Payal Rajput feels Her Movie Offers


LATEST NEWS