క్రేజ్ పోకుండా సోషల్ మీడియాని వాడుతున్నారు

ప్రస్తుతం కరోనా‌తో కామ్ అయిన సినీ ప్రముఖులు ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఇంట్లోనే యోగ, జీన్స్, వర్కౌట్స్, వంటలు అంటూ సెలబ్రిటీస్ ఈ కరోనా టైం ని ఇంటివాళ్లతో కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. హీరోయిన్స్ అయితే బాడీ ఫిట్ నెస్ కోసం యోగాలు, కసరత్తులు అంటూ ఒళ్ళోంచి కష్టపడుతున్నారు. అంతేనా ఆ జిమ్ వీడియోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేసి రచ్చ చేస్తున్నారు. ప్రస్తుతం అందరికి సోషల్ మీడియా అందుబాటులో ఉండడంతో హీరోయిన్ కరోనా టైం ని భీభత్సంగా వాడేస్తున్నారు. హాట్ ఫొటోస్ తోనూ, వాళ్ళు చేసే పనులతోను సోషల్ మీడియాని షేక్ చేస్తున్నారు. ఎలాగూ షూటింగ్స్ బంద్. అలాగే ఫ్రీ టైం. ఫ్యామిలీ తో టైం స్పెండ్ చెయ్యడం మరోపక్క తమ క్రేజ్ ని ఇలా పెంచుకోవడం.

రకుల్ ప్రీత్ దగ్గరనుండి... బాలీవుడ్ హీరోయిన్స్ జాక్వలిన్ ఇలా ఒకరేమిటి ప్రతి హీరోయిన్ కూడా బాడీ ని షేప్ చేసుకుంటూ మంచి ఫొటోస్ షూట్స్ తో ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు. ఇంట్లో చేసే ప్రతి విషయాన్నీ అందరితో పంచుకుంటున్నారు. కరోనా తో మనుషులను కలవొద్దు.. గుంపులుగా ఉండొద్దు... ఇంటి నుండి బయటికి రావొద్దని ని చెబుతున్నారు కానీ.. సోషల్ మీడియాలో పోస్ట్ చెయ్యొద్దు... సోషల్ మీడియాలో ట్వీట్స్ చెయ్యొద్దు ని చెప్పలేదుగా. అందుకే హీరోయిన్స్ కరోనా ఖాళీ టైం ని ఇలా వాడేస్తూ తమ మీద ఉన్న క్రేజ్ ని పక్కకి పోకుండా జాగ్రత్త పడుతున్నారు.

Corona Effect: Heroines Used Social Media:

Celebrities Eye on Social Media for Craze


LATEST NEWS