ఫ్యాన్స్ జీర్ణించుకోలేని పాత్రలో చెర్రీ!

మెగాస్టార్ చిరంజీవి-కొరటాల శివ కాంబినేషన్‌లో ‘ఆచార్య’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సుమారు సగం సినిమాకు పైగా షూటింగ్ అవ్వాల్సి ఉండగా.. కరోనా దెబ్బతో షూటింగ్ అయిపోయింది.‘ఆచార్య’ ఒక్కటే యావత్ సినీ ఇండస్ట్రీ షూటింగ్స్, రిలీజ్‌లను ఆపేసింది. ఈ క్రమంలో దర్శకనిర్మాతలు ఇళ్లలో కూర్చోని వాట్ నెక్స్ట్ అంటూ ప్లాన్‌లు గీసే పనిలో నిమగ్నమయ్యారు. అయితే.. ఈ సినిమాపై పుకార్లు పెద్ద ఎత్తునే షికార్లు చేస్తున్నాయ్. ఇప్పటికే హీరోయిన్ విషయంలో పెద్ద ఎత్తున రూమర్స్ రావడం.. ఆ తర్వాత సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తున్నట్లు వార్తలు రావడం.. అబ్బే అదేం లేదు మళ్లీ మెగా పవర్ స్టార్ మహేశ్ బాబే నటిస్తున్నాడని క్లారిటీ వచ్చేసిందని ఇలా చాలనే వార్తలు పుంకాలు పుంకాలుగా పుట్టుకొచ్చాయ్. 

జీర్ణించుకోలేని వార్త!

అయితే.. తాజాగా చెర్రీ పాత్ర ఇదిగో అంటూ వార్తలు వచ్చేశాయ్. అంతేకాదు.. పాత్ర ఎలా ఉంటుంది..? ఏ మేరకు పాత్ర మెప్పించబోతోంది..? అని మెగాభిమానులు లోతుగా ఆలోచించడం.. మరోవైపు వారి సోర్సెస్ నుంచి సేకరించిన సమాచారం మేరకు ఓ షాకింగ్ పాత్రలో ఆయన నటించబోతున్నాడని.. ఇది నిజంగా మెగాభిమానులు జీర్ణించుకోలేని పాత్ర అని చెబుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే పెద్ద హాట్ టాపిక్ అవుతోంది. కరోనా నేపథ్యంలోనూ దీనిపై పెద్ద ఎత్తున చెర్రీ డై హార్డ్ ప్యాన్స్ చర్చించుకుంటున్నారు. 

ఇదీ అసలు విషయం!

ఈ సినిమాలో చెర్రీ పాత్ర కేవలం 30 నిమిషాలు మాత్రమే ఉంటుందట. యంగ్ మెగాస్టార్‌గా చెర్రీ.. నక్సలైట్ పాత్రలో కనిపిస్తాడట. 30 నిమిషాల నిడివిలో చివర్లో చెర్రీ చనిపోతాడట. సినిమాలో చెర్రీ పాత్ర లక్ష్యం పూర్తవ్వక మునుపే మరణిస్తాడట. అయితే.. చెర్రీ చనిపోయాక.. ఆ పాత్రలో చిరంజీవి దిగిపోతాడట. మెగాస్టార్ ఆ లక్ష్యాన్ని పూర్తి చేసి ముందుకెళ్తాడట. అంటే కాస్త అటు ఇటు చేస్తూ ‘ఖైదీ నంబర్-150’నే అన్న మాట. ఇందులో కూడా డబుల్ రోల్ కావడం.. ఒకరి లక్ష్యాన్ని సాధించడానికి మరొకరు చావు దాకా వెళ్లి రావడం జరుగుతుంది. ఫైనల్‌గా ఇద్దరూ ఇద్దరే.

అన్నీ అనుకున్నట్లు జరిగితే.. జూన్ లేదా జులైలో చెర్రీ పాత్రకు సంబంధించి షూటింగ్ చేయాలని చిత్రబృందం భావిస్తోంది. సో.. చెర్రీ పాత్ర ఇలా ఉంటుందని తెలుసుకున్న మెగాభిమానులు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారట. వాస్తవానికి ‘మగధీర’లో కూడా ఇలానే ఉంటుంది. కానీ ఆ లెక్కలు వేరు. మరి ఇందులో నిజమెంత ..? అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంతవరకూ వేచి చూడక తప్పదు మరి.

News About Ramcharan Role In Aacharya Movie!:

News About Ramcharan Role In Aacharya Movie!


LATEST NEWS