ఉగాది రోజున RRR కొత్త ఎనర్జీ : చిరు

‘బాహుబలి’ సినిమాతో తన సత్తా ఏంటో యావత్ ప్రపంచానికి చాటిచెప్పిన దర్శకధీరుడు రాజమౌళి అలియాస్ జక్కన్న తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘RRR’. ఈ సినిమాలో మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్, యంగ్ టైగర్ నటిస్తున్నారన్న విషయం తెలిసిందే. వీరిద్దరూ ఫలానా పాత్రల్లో నటిస్తున్నారని మాత్రమే చెప్పిన జక్కన్న.. ఇంతవరకూ చిన్నపాటి లుక్ గానీ రిలీజ్ చేయలేదు. అయితే తాజాగా.. అసలు ఆర్ఆర్ఆర్ అంటే ఏంటి..? అని టైటిల్.. మోషన్ పోస్టర్‌ను ఉగాది పండుగ రోజున జక్కన్న రివీల్ చేశాడు. ఇందులో ఆర్ఆర్ఆర్ అంటే ‘రౌద్రం రుధిరం రణం’ అని ఇంతవరకూ నెలకొన్న ఊహాగానాలకు ఫుల్ స్టాప్ పెట్టేశాడు. ఈ టైటిల్‌, మోషన్ పోస్టర్ వీడియోపై పలువురు ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 

ఒళ్లు గ‌గుర్పొడిచింది!

తాజాగా.. ఈ వీడియోపై ఉగాది రోజున సోషల్ మీడియాలో అడుగుపెట్టిన మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ‘ఇప్పుడే ఆర్ఆర్ఆర్‌ మోష‌న్ పోస్టర్ చూశాను. ర‌నువిందుగా వుంది. ఇది చూశాక నా ఒళ్లు గ‌గుర్పొడిచింది. కీర‌వాణి అద్భుత‌మైన నేప‌థ్య సంగీతం ఇచ్చారు. రాజ‌మౌళి, తార‌క్‌, చ‌ర‌ణ్ ప‌నితీరు అద్భుతంగా వుంది. ఈ ఉగాది రోజున అంద‌రిలో ఎన‌ర్జీ నింపారు’ అని మెగాస్టార్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. దీంతో పాటు ఆర్ఆర్ఆర్ మోషన్ పోస్టర్‌ను సైతం చిరు షేర్ చేశారు. 

ధన్యవాదాలు జక్కన్నా..!

అయితే.. దీనిపై కొందరు ప్రముఖులు చిత్ర విచిత్రాలుగా కూడా స్పందింస్తున్నారు. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రియాక్ట్ అవుతూ.. ‘విరామం లేకుండా డిప్రెస్సింగ్ వార్తలు వ‌స్తున్న ఈ త‌రుణంలో జీవితంలో రాబోయే మంచి విష‌యాల కోసం ఎదురుచూడాల‌ని మాకు గుర్తు చేసినందుకు రాజ‌మౌళికి ధ‌న్యవాదాలు. కోవిడ్ -19 లాంటి భ‌యంక‌ర‌మైన విష‌యాలు వున్నాయి. ఆర్ఆర్ఆర్‌ లాంటి గొప్ప విష‌యాలూ వున్నాయి’ అని వర్మ చెప్పుకొచ్చారు.

Megastar Chiru Reacts Over RRR Motion Poster:

Megastar Chiru Reacts Over RRR Motion Poster  


LATEST NEWS