Advertisement

షూటింగ్స్ బంద్‌కు పిలుపునిచ్చిన టీవీ పరిశ్రమ!


తెలుగు టెలివిజన్ టెక్నీషియన్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ యూనియన్ ఈనెల 31వరకు షూటింగ్ లు బంద్ చేయాలని ప్రకటించింది. ఈ మేరకు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ విషయాన్నీ వెల్లడించారు. 

Advertisement

కరోనా కోవిడ్ -19 వైరస్ ని అరికట్టడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగు చర్యలు చేపడుతుంది. ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా అన్నివిధాలుగా ప్రజలను కాపాడేందుకు తమ వంతు కృషి చేస్తుంది..హెల్త్ ఎమర్జెన్సీకి అనుకూలంగా ఉండేందుకు ఇప్పటికే పలు సినిమా హాళ్లు, షూటింగ్స్, మాల్స్, క్లబ్ లు, పార్క్ లు, స్వమ్మింన్గ్ ఫుల్స్, వంటివాటిని నిలిపివేయడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పుడు టీవీ పరిశ్రమలో సీరియల్స్, గేమ్ షోస్, వెబ్ సిరీస్ షూటింగ్ లు నిలిపివేయాలని తెలుగు  టెలివిజన్ టెక్నీషియన్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ యూనియన్ తెలియజేసింది. ఫెడరేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశ,లో అధ్యక్షుడు కూనపు రెడ్డి శ్రీనివాస్ తెలియజేశారు.

ప్రస్తుతం ఒక పెద్ద ఆరోగ్యపరమైన యుద్దాన్ని ఎదుర్కుంటోంది. కరోనా వైరస్ అనే ఈ మహమ్మారిని మన దేశం నుండి తరిమివేయాల్సిన సామజిక బాధ్యత ప్రతి ఒక్కరిపై వుంది. అందుకని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మార్చి 31 వరకు అన్ని రకాల షూటింగ్ లు నిలిపివేస్తున్నాం.. అన్నారు. 

television industry stops shooting:

corona effect: no shooting at television industry
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement