Advertisement
Google Ads BL

‘శీనయ్య’ షూటింగ్ ఆపేసింది ఎవరు?


వివి వినాయక్ దర్శకుడుగా కెరీర్ లో వెనకబడిన సందర్భంలో దిల్ రాజు వినాయక్ ని హీరో అవతారమెట్టమన్నాడు. నిర్మాత చెప్పాడు, కథ సెట్ అయ్యింది, దర్శకుడు రెడీ అయ్యాడు అని వినాయక్ కూడా తడుముకోకుండా హీరో అవతారానికి మారిపోయాడు. వినాయక్ దర్శకుడు లుక్ నుండి హీరో లుక్ కొచ్చేసాడు. వినాయక్ కి తగ్గట్టుగా సినిమా టైటిల్ శీనయ్య అని పెట్టడం. సినిమా షూటింగ్ సగం కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్ కి వినాయక్ బ్రేక్ వేసాడని ఇప్పటి వరకు జరిగిన షూటింగ్ రషెస్ చూసి వినాయక్ తృప్తి పడడం లేదని అలాగే కథలో గందరగోళంతో వినాయక్ స్వయానా దిల్ రాజుకి చెప్పి షూటింగ్ ఆపేసాడని అన్నారు.

Advertisement
CJ Advs

కానీ తాజాగా వినాయక్ కాదు శీనయ్య షూటింగ్ ఆపింది దిల్ రాజే కావాలని శీనయ్య షూటింగ్ ని హోల్డ్ లో పెట్టాడని అంటున్నారు. ఎందుకంటే కొత్త దర్శకుడి చేతిలో శీనయ్యని పెడితే హీరోగా వినాయక్ తన పని తాను చేసుకోకుండా దర్శకుడిగా మారిపోయి షూటింగ్ లో వేళ్ళు పెట్టి కెలికేసాడని, అలాగే ఇప్పటివరకు తెరకెక్కిన సగం స్క్రిప్ట్ విషయాన్నీ పక్కనబెట్టి, సెకండ్ హాఫ్ స్క్రిప్ట్ లో మార్పులు చేయించాలని దిల్ రాజు అనుకుంటున్నాడట. మొదట్లో శీనయ్య స్క్రిప్ట్ ఫైనల్ అయినప్పుడు వినాయక్ కూడా ఉన్నాడని కానీ ఈసారి వినాయక్ జోక్యం లేకుండా సెకండ్ హాఫ్ స్క్రిప్ట్ మారబోతుందని అది మారిన తర్వాతే దిల్ రాజు మళ్ళీ శీనయ్య షూటింగ్ ని పట్టాలెక్కిస్తాడని అంటున్నారు.

Break to VV Vinayak Seenayya Movie Shooting:

Dil Raju Stopped Seenayya Movie Shooting
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs