Advertisement

హరీష్ పిలుపుకు పోలీసుల స్పందన.. ఏం జరిగింది!


మాస్ చిత్రాలని విభిన్నంగా తెరకెక్కించే దర్శకుడు హరీష్ శంకర్ ఆన్ లైన్లో చాలా ఆక్టివ్ గా ఉంటాడు. ట్విట్టర్లో ప్రతీ విషయం పైనా తనదైన వాదన వినిపిస్తుంటాడు. కొన్ని కొని సార్లు ఫలానా గ్రూపు రక్తదాతలు కావాలి అంటూ పోస్టులు కూడా పెడుతుంటాడు. అలాగే తనకేదైనా సందేహం వస్తే..ఆ సందేహానికి సమాధానం కోసం నెటిజన్లని అడుగుతుంటాడు. 

Advertisement

 

ఆ విధంగా సోషల్ మీడియాని అత్యంత ఉపయోగకరంగా వాడుకునే హరీష్ శంకర్.. ఈ సారి ఆ వాడకంలో సూపర్ సక్సెస్ అయ్యాడు. వివరాల్లోకి వెళితే హరీష్ శంకర్ జూబ్లీ ఎన్ క్లేవ్ రెసిడెన్సీలో నివాసం ఉంటున్నాడు. ఆ ప్రాంతంలో గత కొన్ని రోజులుగా రోడ్డు మరమ్మత్తులు జరుగుతున్నాయి.  అర్థరాత్రి సమయంలో ఆ మరమ్మత్తుల కారణంగా పెద్ద పెద్ద శబ్దాలు వస్తున్నాయి. దీనివల్ల అక్కడి స్థానికులు తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారు

 

అదే విషయాన్ని జూబ్లీ ఎన్ క్లేవ్ రెసిడెన్సీ జనాల తరపున పోలీసులకు హరీష్ శంకర్ ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు ఇచ్చాడు.. హరీష్ శంకర్ చేసిన ట్వీట్ కి స్పందించిన పోలీసులు నిమిషాల్లోనే అక్కడ సౌండ ఆపించేశారు. అంత తొందరగా రియాక్ట్ అయిన పోలీసులకి తన కృతజ్ఞతలు తెలుపుకున్నాడు హరీష్ శంకర్.. సినిమా ప్రమోషన్లకే కాదు..ప్రజా సమస్యలకి సోషల్ మీడియాని ఎలా వాడాలో హరీష్ దగ్గరే నేర్చుకోవాలి.

Cyberabad police responded to Director harish Shankar:

Harish Shankar tweeted about a incident
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement