పెళ్లికి ముందే అన్నీ.. తప్పేముంది!?

బాలీవుడ్‌లో చాలామంది హీరోయిన్స్ టాప్ రేంజ్ లో ఉన్నా.. కెరీర్ స్టార్టింగ్ లో ఉన్నప్పటికీ.. అలాగే మిడిల్ రేంజ్ హీరోయిన్స్ అయినా.. ఏదో ఒక హీరోతోనో, లేదంటే బిజినెస్ మ్యాన్ తోనో, క్రికెటర్స్‌తోనో లవ్‌లో ఉండడం.. దానిని సీక్రెట్‌గా మెయింటింగ్ చెయ్యడం, మీడియాకి దొరికినప్పుడు ఏం లేదని బుకాయించడం, అలాగే డేటింగ్, రెస్టారెంట్స్ అంటూ తిరగడం, మధ్యలో విభేదాలతో బ్రేకప్ అవడం లాంటివి చాలా కామన్. కాస్త లవ్ స్ట్రాంగ్ ఉన్నోళ్లు మాత్రం ఓ ఐదేళ్లు డేటింగ్, అలాగే సహజీవనం ఆ తర్వాత ఎప్పటికో పెళ్లి చేసుకుంటారు.

అయితే కొంతమంది పెళ్లి, ప్రేమ విషయంలో బోల్డ్ స్టేట్మెంట్స్ ఇచ్చినట్టుగా ఇప్పుడు బాలీవుడ్‌లో టాప్ రేంజ్‌లో ఉన్న కియారా అద్వానీ కూడా పెళ్లి పై ఇలాంటి బోల్డ్ స్టేట్మెంట్స్ ఇచ్చేస్తుంది. అదేమిటంటే.. పెళ్లికి ముందు డేటింగ్ చేసినా అందులో ఎలాంటి తప్పు లేదు అంటూ చెప్పడం అందరికి షాకిచ్చింది. పెళ్లికి ముందు కలిసి తిరగడంలో తప్పు లేదని... అసలు పెళ్ళికి ముందు ఆలా తిరిగితే అది ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి తోడ్పడుతుందని.. తరవాత ఒకరిని విడిచి మరొకరం ఉండలేమనే నిర్ణయానికి వచ్చిన తర్వాత పెళ్లి చేసుకోవచ్చని చెబుతుంది. మరి కియారా అద్వానీ  కూడా మొన్నామధ్యన సౌత్ ఆఫ్రికా ట్రిప్‌లో ఉన్నప్పుడు.. ఓ హీరోతో లవ్ ఉంది అనే ప్రచారం జరిగింది. కానీ కియారా అద్వానీ మాత్రం తాను ఎలాంటి రిలేషన్ షిప్ లో లేనని, సింగిల్ గానే ఉన్నానని షాకిచ్చింది.

Kiara Advani Okay With Physical Relationship Before Marriage:

Kiara Advani Okay With Physical Relationship Before Marriage  


LATEST NEWS