మొత్తానికి హీరో లుక్ రివీల్ చేశారుగా...

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ ఉప్పెన అనే సినిమాతో తెలుగు పరిశ్రమకి పరిచయం కాబోతున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని బుచ్చిబాబు సానా  అనే నూతన దర్శకుడు దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఇప్పటి వరకు ఈ సినిమా నుండి చాలా అప్డేట్స్ వచ్చాయి. కానీ ప్రతీ అప్డేట్ లో హీరోని గానీ హీరొయిన్ ని గానీ పూర్తిగా కనిపించకుండా మొహం దాచేసారు.

 

ఫస్ట్ లుక్ మొదలుకుని, చిన్న పాటి టీజర్ వరకూ ఇదే పద్దతిని అవలంబించారు. హీరో ఫస్ట్ లుక్ పోస్టర్ లో వైష్ణవ్ తేజ్ సముద్రం వైపు చూస్తూ చేతులు చాపిన ఫోటోని రివీల్ చేశారు. అలాగే హీరోయిన్ లుక్ ని వర్షంలో తడుస్తున్నట్టుగా చూపించారు. ఈ రెండు పోస్టర్లలోనూ హీరో హీరోయిన్ల మొహాలు కనిపించలేదు.  అది చూసిన వారంతా సినిమా ఏదో కొత్త కాన్సెప్ట్ తో వస్తుందని, అందుకే కొత్త రకంగా సినిమాని ప్రజల్లోకి తీసుకెళ్ళేందుకే ఈ విధంగా చేస్తున్నారని అనుకున్నారు. 

 

కానీ దానికి విరుద్ధంగా నేడు ఉప్పెన సినిమా నుండి వైష్ణవ్ తేజ్ పూర్తి లుక్ ని విడుదల చేశారు. అలాగే హీరోయిన్ క్రితి శెట్టి లుక్ ని కూడా రివీల్ చేసింది. మొత్తానికి ఉప్పెన హీరో హీరోయిన్లు ఎలా ఉంటారో తెలిసిపోయింది. తమిళ నటుడయిన విజయ్ సేతుపతి ఈ సినిమాలో విలన్ గా కనిపిస్తుండగా, రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.  

Finally Hero look revealed :

Mega hero Saidharam Tej brother Vaishnav tej look revealed vrom hismovie Uppena


LATEST NEWS