శ్రీకాంత్ అడ్డాల చేతిలో మరో సినిమా...!

శ్రీకాంత్ అడ్డాల..ఒకప్పుడు కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ముకుంద వంటి సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లని తనంత బాగా మరెవరూ తీయలేరనేంతగా పేరు తెచ్చుకున్నాడు. కానీ ఆ పేరు మొత్తం మహేష్ తో తీసిన బ్రహ్మోత్సవంతో గంగలో కలిసిపోయింది. ఏ జోనర్ లో తను టాప్ సినిమాలు తీయగలడను అనుకున్నారో, ఆ జోనర్ లోనే సూపర్ ఫ్లాప్ ఇచ్చి అందరినీ షాక్ కి గురిచేశాడు.

 

బ్రహ్మోత్సవం సినిమా మహేష్ కి ఎంత చెడ్డ పేరు తీసుకువచ్చిందో అందరికీ తెలిసిందే.. ఆ సినిమా అప్పటి నుండి శ్రీకాంత్ అడ్డాల పరిస్థితి కూడా పూర్తిగా మారిపోయింది. ఏ హీరో కూడా శ్రీకాంత్ అడ్డాల కథ వినడానికి సిద్ధంగా లేకుండా అయిపోయింది. అయితే ప్రస్తుతం పరిస్థితి కొద్దిగా మారినట్టు కనిపిస్తుంది. ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల వెంకటేష్ హీరోగా నారప్ప అనే సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్ సాధించిన అసురన్ సినిమాకి రీమేక్.

 

ఈ రీమేక్ పనిలో శ్రీకాంత్ అడ్దాల బిజీగా ఉంటే ఇప్పుడు మరో కొత్త ప్రాజెక్టు అతని చేతిలోకి వచ్చింది. నిర్మాణ సంస్థ 14 రీల్స్ బ్యానర్  వరుణ్ తేజ్ హీరోగా ఒక సినిమా చేయాలని చూస్తుందట. ఈ సినిమాకి శ్రీకాంత్ అడ్డాలని దర్శకుడిగా తీసుకోవాలని చూస్తున్నారట. గతంలో శ్రీకాంత్ అడ్డాల వరుణ్ తేజ్ తో ముకుంద అనే సినిమా చేశాడు. ఇప్పుడు మళ్ళీ వీరిద్దరూ మరో మారు కలవనున్నారని సమాచారం. ఇప్పటికైతే అధికారిక సమాచారం రాలేదు. ఒకవేళ ఈ వార్త నిజమే అయితే శ్రీకాంత్ అడ్డాలకి పండగే..

Srikanth addaala got another project:

Srikanth Addala got another opportunity to direct a film with Varun Tej


LATEST NEWS