అల్లు అరవింద్ అతికి త్రివిక్రమ్‌ అసహనం!

‘అల వైకుంఠపురములో’ సినిమాని త్రివిక్రమ్... ఓన్ బ్యానేర్ లాంటి హరిక హాసిని క్రియేషన్స్ లోనే మొదలు పెట్టాడు. కానీ హీరోగారు అదే అల్లు అర్జున్ ఏమో.. ఈ సినిమాలో తమ గీత ఆర్ట్స్ కి కూడా వాటా కావాలని పట్టుబట్టి మరీ.. హారిక హాసినితో కలిసి గీత్ ఆర్ట్స్‌ని భాగస్వామిని చేసాడు. త్రివిక్రమ్‌కి చినబాబుకి ఇష్టం లేకపోయినా.. హీరో గారి అలక, ఆర్డర్‌తో ‘అల వైకుంఠంలో’ గీత ఆర్ట్స్ వచ్చి చేరింది. అది త్రివిక్రమ్ కి నచ్చకపోయినా .. యాక్సప్ట్ చేసారు. అయితే తాజాగా మరోసారి త్రివిక్రమ్ ని అల్లు అరవింద్ హార్ట్ చేసాడనే న్యూస్ మాత్రం ఫిలింసర్కిల్స్ లో స్ప్రెడ్ అయ్యింది.

అదేమంటే.. త్రివిక్రమ్ అల వైకుంఠపురములో సక్సెస్‌తో చాలా హ్యాపీగా ఉన్నాడు. అరవింద్ గారు కూడా తెగ సక్సెస్ మీట్స్ నడిపాడు. షేర్ ఇవ్వడం ఇష్టం లేని హరిక హాసిని చినబాబు మాత్రం సైలెంట్ గా సక్సె మీట్స్‌కి వచ్చాడు. అయితే ఈమధ్యన అల వైకుంఠపురములో సినిమా హిందీ రీమేక్ రైట్స్‌ని సల్మాన్ కోసం బాలీవుడ్ నిర్మాత ఒకరు 8 కోట్లకి కొన్నారని టాక్ నడవడమే కాదు.. సల్మాన్ ఖాన్ అల వైకుంఠపురములో రీమేక్ పై ఆసక్తి చూపుతున్నాడనే అన్నారు. అయితే హిందీలో అల డీల్ నిజమే కానీ.. మధ్యలో అరవింద్ వేసిన అడ్డు పుల్లతో ఆ డీల్ ఆగింది. 

త్రివిక్రమ్ - చినబాబు కలిసి హిందీ రీమేక్ రైట్స్ ని రికార్డు ధరకి అమ్మడానికి బాలీవుడ్ నిర్మాత ఒకరితో బేరం కుదుర్చుకున్నాక... అబ్బే అల వైకుంఠపురములో హిందీ రీమేక్ రైట్స్ అమ్మొద్దు నేనే హిందీలో రీమేక్ చేసి సినిమా తీస్తా అని అల్లు అరవింద్ త్రివిక్రమ్ కి అడ్డు చెప్పడంతో.. త్రివిక్రమ్ చేసేదేం లేక ఆ హిందీ డీల్ క్యాన్సిల్ చేసాడట. కానీ త్రివిక్రమ్ మాత్రం అరవింద్ అతి కి అసహనంగా ఉన్నాడని అంటున్నారు.

Trivikram Un Happy With Allu Aravindh Over Action! :

Trivikram Un Happy With Allu Aravindh Over Action!   


LATEST NEWS