Advertisement
Google Ads BL

‘పింక్’ రీమేక్ షూటింగ్‌కి బ్రేక్.. ఎందుకంటే?


పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చి ఇంకా నెల పూర్తి కాలేదు. పండగ తర్వాత పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్ సెట్స్ మీద కొచ్చాడు. వచ్చిన దగ్గర నుండి ఇప్పటి వరకు బ్రేక్ లేకుండా సినిమా షూటింగ్ చెయ్యడమే కాదు.. పింక్ రీమేక్ తో పాటుగా క్రిష్ సినిమాని మొదలు పెట్టి షాకిచ్చాడు. ఆ సినిమా కూడా పింక్ రీమేక్ తో పాటుగా తెరకెక్కుతుంది అని చెప్పడం, ఈలోపు హరీష్ శంకర్ తో సినిమా ఓకే చెయ్యడం చేసిన పవన్ అటు రాజకీయాలతోనూ బిజీగా ఉంటున్నాడు. ఎన్నడూ  లేని విధముగా పవన్ కళ్యాణ్ బద్దకించకుండా సినిమా షూటింగ్ తో పాటుగా పొలిటికల్ మీటింగ్స్ కి హాజరవుతున్నాడు.

Advertisement
CJ Advs

అయితే తాజాగా పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చి ఇంకా నెల అవ్వకముందే అపుడే సినిమా షూటింగ్స్ కి బ్రేకిచ్చినట్లుగా తెలుస్తుంది. అంటే ఈనెల 12, 13 తేదీల్లో కర్నూలులో పర్యటించడానికి పవన్ ప్రణాళిక సిద్ధం కావడంతో కొన్ని రోజులు తాత్కాలికంగా పవన్ పింక్ రీమేక్ షూటింగ్ కి బ్రేక్ వేసారట. కర్నూలు పర్యటన రెండు రోజుల్లో ముగించుకుని అటునుండి అటే పవన్ కళ్యాణ్ అమరావతి రైతులతో భేటీ అవుతాడని ఈలోపు పింక్ రీమేక్ షూటింగ్‌కి బ్రేక్ పడినా, క్రిష్‌తో చేసే చిత్రానికి సంబంధించి పవన్‌కి సంబంధం లేని సీన్స్‌ని షూట్ చేస్తారని తెలుస్తుంది. 15న అమరావతిలో రైతులతో ముఖాముఖీ తర్వాత పవన్ నేరుగా హైదరాబాద్ చేరుకొని షూటింగ్ కి డైరెక్ట్ గా హాజరవుతాడని అంటున్నారు.

Break to Pink Remake Shooting.. This is the Reason:

Pawan Kalyan Busy with Politics
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs