నాగ్ సరసన కొత్త బ్యూటీ.. కలిసొచ్చేనా!?

కింగ్ నాగార్జున టైటిల్ పాత్రలో ప్రముఖ నిర్మాణ సంస్థ మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప్రొడ‌క్షన్ నెం.6గా అహిషోర్ సాల్మోన్ ద‌ర్శక‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘వైల్డ్ డాగ్‌’. ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌ను ఇప్పటికే విడుదల చేసిన చిత్రబృందం.. అంద‌రిలో ఆస‌క్తిని రేపింది. మరీ ముఖ్యంగా డిఫ‌రెంట్‌గా ఉన్న నాగార్జున్ లుక్ రీసెంట్‌గా జ‌రిగిన దిశ హంత‌కుల‌ ఎన్‌కౌంట‌ర్‌ను గుర్తుకు తెచ్చేలా ఉంది. ఈ సినిమాలో నాగార్జున ఎన్‌.ఐ.ఎ ఆఫీస‌ర్‌గా న‌టిస్తున్నారని ఫ‌స్ట్ లుక్‌లోని న్యూస్ పేప‌ర్ రిపోర్ట్ ఆధారంగా తెలుస్తుంది.

అయితే.. నాగ్ సరసన హీరోయిన్‌గా ఎవరు నటిస్తారు..? సినిమాలు కీలక పాత్రల్లో నటించే నటీనటులెవరు..? అనే విషయాన్ని మాత్రం ఇంతవరకూ చిత్రబృందం ఎక్కడా రివీల్ చేయకుండా చాలా సీక్రెట్‌గా మ్యానేజ్ చేస్తోంది. తాజాగా..  నాగ్‌ సరసన ఎవరు నటిస్తారనే విషయం తాజాగా తెలిసిపోయింది. నాగ్‌తో రొమాన్స్ చేయడానికి అందాల సుందరి దియా మీర్జా తీసుకున్నట్లు తెలుస్తోంది. అక్కినేని ఏజ్‌కు సరిపోయేలా దియా అయితే సరిగ్గా సెట్ అవుతుందని చిత్రబృందం భావించి తీసుకుందని సమాచారం. కాగా.. దియా హైదరాబాద్‌లోనే పుట్టిపెరిగిన విషయం తెలిసిందే. తమిళ్‌లో అరవింద్‌ స్వామి సరసన ‘ఎన్‌ స్వాసా కాట్రే’ చిత్రంలో అతిథి పాత్రతో ఈ భామ వెండితెర ప్రవేశం చేసింది. ఆ తర్వాత దాదాపు అన్ని చిత్రాలు హిందీలోనే చేసింది. ఇటీవల వెబ్‌సిరీస్‌లో కూడా ఈ ముద్దుగుమ్మ అడుగులేసింది.

కాగా.. అప్పుడెప్పుడో ‘వైల్డ్ డాగ్‌’కు సంబంధించిన అప్డేట్ రాగా.. తాజాగా హీరోయిన్ విషయం హడావుడి మొదలైంది. ఈ బ్యూటీ నాగ్‌ సరసన నటించి అక్కినేని ఫ్యాన్స్, టాలీవుడ్ ప్రియులను ఏ మాత్రం మెప్పిస్తుందో.. మరీ ముఖ్యంగా నాగ్‌కు ఏ మాత్రం కలిసొస్తుందో..!. ఇదిలా ఉంటే.. ఇప్పటికే పోలీస్ ఆఫీసర్ చేదు అనుభవమే మిగలగా తాజా ప్రయత్నం ఏ మాత్రం వర్కవుట్ అవుతుందో తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు వేచి చూడాల్సిందే.

Is Bollywood actress to play Nagarjuna’s wife in Wild Dog?:

Is Bollywood actress to play Nagarjuna’s wife in Wild Dog?  


LATEST NEWS