వరుస సినిమాలతో రాబోతోన్న ‘నిన్నుతలచి’ హీరో!

వంశీ యకసిరి, నిన్ను తలచి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన హీరో. నిన్ను తలచి తరువాత వంశీ యకసిరి చిత్రాలకు కథ చర్చలు జరుగుతున్నాయి, ఒకటి బాహుబలి సినిమాకి రాజమౌళి వద్ద సహాయ దర్శకుడిగా పనిచేసిన భాస్కర్ నీ దర్శకుడిగా పరిచయం చేస్తూ, లవ్, సస్పెన్స్, థ్రిల్లర్ జోనర్ గా తెలుగు, మరాఠీ, తమిళ్ మూడు భాషలలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాకు ట్రైనర్ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారు. ఈ సినిమాకు కెమెరా మంజునాథ్ నాయక్, సంగీతం జయవర్ధన్ అంకె, నిర్మాతలు : శిల్పా గాడబోలే, డి. అరుణ. 

కాగా, మరో  సినిమాకు ధర్మ అనే మరో కొత్త దర్శకుడిని పరిచయం చేస్తూ “ఎందుకు ఏమిటి ఎలా” అనే డిఫరెంట్ కథతో తెరకెక్కనుంది. వీటితో పాటు ఒక వెబ్ సిరిస్ కూడా చేయనున్నట్లు తను తెలిపారు. ఏది ఏమైనా నిన్ను తలచి వంటి లవ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ తో మనందరినీ బాగా అలరించిన వంశీ వరుస సినిమాలతో మన ముందుకు అతి త్వరలో రానున్నాడు.

Ninnu Thalachi Hero Yamsi Yakasiri Next Movies Details:

Hero Yamsi Yakasiri Next Projects Announced


LATEST NEWS