రకుల్.. అందుకోసమే నటించిందంట!

టాలీవుడ్‌లో చాలా తక్కువ సమయంలో స్టార్ హీరోలతో సినిమా చేసి.. స్టార్ హీరోయిన్ రేంజ్ అందుకున్న రకుల్ ప్రీత్‌కి అంతే తొందరగా స్టార్ డం నుండి కిందకి వచ్చేసింది. ప్రస్తుతం తెలుగు అవకాశాలు లేకపోయినా.. తమిళనాట, హిందీలో సినిమాలు చేసుకుంటున్న రకుల్ ప్రీత్ సింగ్ కేవలం ఓ కారు కొనుక్కోవడానికి హీరోయిన్‌గా మారిందట. తాను సినిమాల్లోకి వచ్చేసిన ఉద్దేశ్యాన్ని చెబుతూ.. తాను కాలేజ్ చదివే రోజుల్లో ఓ కారు కొనుక్కోవాలని కోరికగా ఉండేదట. తన ఫ్రెండ్స్ అందరిలో తనకే ముందు కారు కొనుక్కోవాలని, అది కూడా నా సొంత డబ్బుతో కారు కొనుక్కోవాలని అనుకునేదట.

అప్పుడే ఓ కన్నడ సినిమా ఆఫర్ రావడంతో అలా సినిమాలోకి వచ్చిందట. అయితే కారు కోసం సినిమా చేసిన తనకి చివరికి ఆ సినిమాలే వృత్తిగా మారాయని చెబుతుంది. ఇక జాబ్ విషయంలో ఎంత పర్ఫెక్ట్‌గా ఉంటామో.. సినిమాల విషయంలోనూ అంతే నిబద్ధతతో పనిచేస్తూ కష్టపడుతున్నా అంటుంది. స్టార్ డం, క్రేజ్ అనే పదాలకు దూరంగా ఉంటాను కనుకే నా వృత్తిని ప్రేమించగలుగుతున్నా అంటుంది రకుల్ ప్రీత్. అయితే అమ్మడు ఫామ్‌లో ఉండగానే నాలుగు రాళ్లు వెనకేసుకుని గట్టిగానే నిలబడింది. సినిమాలు ఎంతకాలమో ఉండవని ముందుగానే గమనించిన రకుల్.. బిజినెస్‌లోనూ దూసుకుపోతుంది. ఎంతైనా రకుల్ తెలివిగలది మరి.

Rakul Preet Singh About her Cine Entry:

I want to buy a Car.. Thats way entered into movies.. says Rakul 


LATEST NEWS