రాములమ్మకి ఓకే గానీ.. టబుకే?

మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాతో గ్రాండ్ గా సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చింది లేడీ సూపర్ స్టార్ విజయశాంతి. సినిమాలో విజయశాంతికున్న ప్రాధాన్యం మహేష్ బాబు పాత్రకి సరితూగగలిగేలా వుంది. అందుకే విజయశాంతి కూడా ఆ పాత్రకి ఒప్పుకుంది. ఇక మూవీ యూనిట్ కూడా మహేష్ తో సమానమైన గౌరవం, ప్రమోషన్స్ లో స్పేస్ ఇచ్చారు. ఇక పోస్టర్స్ లోను విజయశాంతిని ఎక్కువగా వదిలారు. అయితే ఇన్ని కండిషన్స్ మీదనే విజయశాంతి సినిమాల్లోకి మళ్ళీ రీఎంట్రీ ఇచ్చింది. అన్ని కండిషన్స్ మధ్యన కూడా విజయశాంతి మూడు కోట్ల పారితోషకాన్ని ముక్కు పిండి వసూలు చేసిందట.

మరి అల వైకుంఠపురములో కూడా సీనియర్ హాట్ హీరోయిన్ టబు కూడా రీఎంట్రీ ఇచ్చింది. అయితే విజయశాంతి పాత్ర ముందు టబు అల వైకుంఠపురములో పాత్ర తేలిపోయింది. త్రివిక్రమ్ అంత పెద్ద ఆర్టిస్ట్ ని ఎలా వాడాలో తెలియక. ఆటలో అరటిపండు మాదిరి టబుని ఆ సినిమాలో ఉంచేసాడు. కేవలం సచిన్ ఖేద్కర్ ని నాన్నా అనడం తప్ప టబు మరో ఎక్సప్రెషన్ ఎక్కడా ఇచ్చినట్టుగా సినిమా మొత్తంలో కనబడదు. అంటే అలాంటి పాత్రకే టబుకి నిర్మాతలు మూడు కోట్లు సమర్పించారట. మరి పెద్ద సినిమా కాబట్టి చిన్న పాత్ర అయినా.. మూడు కోట్ల పారితోషకానికి టబు పడిపోయింది. కానీ విజయశాంతి మాత్రం మూడు కోట్లు... ప్లస్ సినిమాలో ఇంపార్టెన్స్ అంటూ కండిషన్స్ పెట్టి సినిమాల్లో సక్సెస్ అయితే.. టబు మాత్రం భారీ పెయిడ్ ఆర్టిస్ట్ గా మిగిలిపోయింది. అయితే విజయశాంతి పాత్రకి మూడు కోట్లు అంటే ఓకే గాని.... టబు పాత్రకి 3 కోట్లు అంటే మాత్రం ఈ భామకు ఇంత వేస్ట్ అంటున్నారు.

Remuneration to Senior Heroines Vijayashanthi and Tabu:

Vijayashanthi Highlight in Sarileru Neekevvaru but Tabu Role in Ala?


LATEST NEWS