Advertisement

శ్రీను వైట్ల ఇంట్రెస్టింగ్ కథ ఏ హీరో కోసమో!?


టాలీవుడ్ డైరెక్టర్ శ్రీను వైట్ల గురించి ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు వరుస విజయాలను అందుకున్న ఆయన.. ఈ మధ్య ఢీలా పడ్డారు. మునుపటి క్రేజ్‌ను సంపాదించుకోవడానికి ఆయన తహతహలాడుతున్నారు. ఈ క్రమంలో తమిళ్‌లో సూపర్ డూపర్ హిట్టయిన ‘అసురన్’ రీమేక్ ఈయనే చేస్తున్నారని దాదాపు ఫిక్సయ్యింది.. అయితే ఇంతవరకూ అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. ఒకప్పుడు వరుస విజయాలు అందుకుని టాప్ డైరెక్టర్లలో ఒకరుగా దూసుకెళ్తున్న ఆయన.. అదే ఊపు కొనసాగించలేకపోయాడు.. ఇందుకు కారణం స్టోరీల్లో పస లేకపోవడంతో వరుస అట్టర్ ప్లాప్‌లు ఆయన ఖాతాలో పడ్డాయ్. అయితే డైరెక్షన్‌నే నమ్ముకున్న ఆయన.. మరోసారి తన సత్తా ఏంటో చూపించడానికి సిద్ధమయ్యారు.

Advertisement

ఓ ఇంట్రెస్టింగ్ కథతో మళ్లీ టాలీవుడ్ సిని ప్రియుల ముందుకు రాబోతున్నట్లు స్వయంగా ఆయనే ప్రకటించారు. తాజాగా.. ఆయన మాట్లాడుతూ ‘అమర్ అక్బర్ ఆంటోని’ సినిమా పరాజయం నిరాశ పరిచిన మాట వాస్తవమేనని అయితే ప్రేక్షకుల అభిరుచి మారిపోయిందనే విషయాన్ని ఈ సినిమా ద్వారా తాను తెలుసుకున్నానన్నారు. ప్రేక్షకులు కొత్తదనం కోరుకుంటున్నారని తెలుసుకున్న తాను లాంగ్ గ్యాప్ తర్వాత మంచి కథను సిద్ధం చేసుకున్నట్లు తెలిపారు. అది ఇంట్రెస్టింగ్ పాయింట్ చుట్టూ అల్లబడిన కథ అని ఆయన చెప్పారు. అయితే ఈ ఇంట్రెస్టింగ్ కథ ఏ హీరో కోసం..? సినిమా ఎప్పుడు సెట్స్‌పైకి వెళ్తుంది..? అనే విషయాలు త్వరలోనే ప్రకటిస్తానని శ్రీనువైట్ల చెప్పారు. మొత్తానికి చూస్తే.. లాంగ్ గ్యాప్ తర్వాత బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి శ్రీనువైట్ల వచ్చేస్తున్నారన్న మాట. మరి ఆ హీరో ఎవరో తెలిస్తే దాన్ని బట్టి కథ రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఆ విషయం తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ వేచి చూడాల్సిందే మరి.

Seenu Vaitla Intersting Story For Whom!:

Seenu Vaitla Intersting Story For Whom!  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement