Advertisement
Google Ads BL

‘రూలర్’‌పై ఈ రూమర్లేంటి?


‘మహానాయకుడు, కథానాయకుడు’ దెబ్బ ‘రూలర్’ మీద గట్టిగా పడిందో... బాలకృష్ణే రొటీన్ మూసలో రూలర్ సినిమాని ఓకె చేసి దెబ్బతిన్నాడో కానీ.. ప్రస్తుతం రూలర్ సినిమాకి అన్ని ఇన్ని కష్టాలు కాదు. సినిమా రొటీన్ ఫార్మేట్‌లో ఉందని, ఇప్పుడు ఈ మాస్ మసాలా కథలను ఎవరు చూస్తారంటూ... నిన్నమొన్నటివరకు రూలర్ సినిమా విషయంలో కామెంట్స్ చేసిన జనాలు రూలర్ ట్రైలర్ చూసాక బాలయ్య మారడని ఫిక్స్ అయ్యారు. హై ఓల్టేజ్ పవర్ కేరెక్టర్ సింహంలా గర్జిస్తున్న బాలయ్యని చూసి ఆయన ఫ్యాన్స్ నవ్వుకుంటున్నారు. ముందు విగ్గు మార్చవయ్యా అంటూ సెటైర్స్ వేస్తున్నారు. బాడీని తగ్గించడంలో ఉన్న డెడికేషన్ విగ్గుల విషయంలో పెట్టవా అంటూ మొహం మీదే అడుగుతున్నారు.

Advertisement
CJ Advs

ఇదంతా ఓ ఎత్తైతే... ఈ నెల 20న విడుదల కాబోతున్న రూలర్ సినిమా బిజినెస్ విషయంలో వస్తున్న నెగెటివ్ ఫీడ్ బ్యాక్ సినిమా మీద ఉన్న క్రేజ్‌ని కూడా నీరు గార్చేసాయి. రూలర్ సినిమాకి హైప్ లేని కారణంగా, బాలయ్యకి ఓవర్సీస్‌లో పట్టులేని కారణంగా రూలర్ సినిమాని అక్కడ ఫ్రీగా ఇచ్చేశారనే న్యూస్ కొద్దీ రోజులుగా నడుస్తుంది. మరో పక్క థియేట్రికల్ రైట్స్ విషయంలో బయ్యర్లు భయపడుతున్నారట. రూలర్ ట్రైలర్ చూసిన బయ్యర్లకు భయం పట్టుకుందని, బాలయ్య మాస్ లుక్ ఇవేమి సినిమాని కడకి చేర్చవని, ట్రైలర్ మొత్తం రొటీన్‌గా ఉండడంతో.. రూలర్ సినిమా మీద అంచనాలు తగ్గిపోయాయని అందుకే సినిమాని కొనేందుకు బయ్యర్లు వెనకాడుతున్నారని అంటున్నారు. 

Rumours On Balayya Ruler Movie:

Ruler Overseas Rights.. Free Free 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs