వినాయక్ విడుదల చేసిన ‘విట్టల్‌వాడి’ ట్రైలర్


ఎన్.ఎన్.ఎక్స్పీరియన్స్ ఫిలిమ్స్ విట్టల్ వాడి మూవీ ట్రైలర్ ని  రిలీజ్ చేసిన డాషింగ్ డైరెక్టర్ వి.వి.వినాయక్ 

రోహిత్, సుధా రావత్ హీరో హీరోయిన్లుగా ఎన్.ఎన్.ఎక్స్పీరియన్స్ ఫిలిమ్స్  బ్యానర్ లో జి.నరేష్ రెడ్డి నిర్మించిన చిత్రం విట్టల్ వాడి.

ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ప్రముఖ డైరెక్టర్ వి.వి.వినాయక్ గారి చేతుల మీదుగా జరిగింది.

ఈ సందర్బంగా డైరెక్టర్ వి.వి.వినాయక్ గారు మాట్లాడుతూ... ట్రైలర్ చాలా బావుంది. డైరెక్టర్ నాగేందర్ కి మంచి పేరు రావాలి. ప్రొడ్యూసర్ కి డబ్బులు బాగా రావాలి అని కోరుకుంటున్నాను. రోహిత్ కి మంచి భవిష్యత్తు ఉంది, అలాగే మూవీకి వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి అల్ ది బెస్ట్ అని చెప్పారు.

ప్రొడ్యూసర్ నరేష్ రెడ్డి గారు మాట్లాడుతూ... విట్టల్ వాడి మూవీ ట్రైలర్ లాంచ్ చేసిన వి.వి.వినాయక్ సర్ కి చాలా చాలా థాంక్స్. ఈ మూవీ మీ అందరికి నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను.

డైరెక్టర్ నాగేందర్ మాట్లాడుతూ... మా మూవీ ట్రైలర్ లాంచ్ చేసిన కమర్షియల్ డైరెక్టర్ వి.వి.వినాయక్ సర్ కి చాలా థాంక్స్.

విట్టల్ వాడి మూవీలో హీరోగా చేసిన రోహిత్ మాట్లాడుతూ... మూవీ ట్రైలర్ లాంచ్ చేసిన వి.వి.వినాయక్ సర్ కి చాలా చాలా థాంక్స్.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న రైటర్ ఆకుల శివ మాట్లాడుతూ... రోహిత్ ఈ మూవీలో అద్భుతంగా నటించాడు. ప్రొడ్యూసర్ నరేష్ రెడ్డి  నా ఫ్రెండ్. ఖర్చుకి వెనకాడకుండా ఈ సినిమాని నిర్మించారు. చిత్ర యూనిట్ అందరికి నా బెస్ట్ విషెస్ అని తెలిపారు.

నటీనటులు:

రోహిత్ రెడ్డి, సుధా రావత్, అమిత్, అప్పాజీ అంబరీష్ దర్బా, చమ్మక్ చంద్ర, జయ శ్రీ, రోల్ రైడా

సాంకేతిక నిపుణులు:

కెమెరామెన్: సతీష్ అడపా

మ్యూజిక్: రోషన్ కోటి

ఎడిటర్: శ్రీనివాస్ కె.మోపర్తి

ఫైట్స్: శంకర్.యు

పిఆర్ఓ: మధు వి.ఆర్ 

లైన్ ప్రొడ్యూసర్: ప్రశాంత్ పేరుపల్లి 

నిర్మాత: నరేష్ రెడ్డి.జి

డైరెక్టర్: నాగేందర్.టి  

Director VV Vinayak Launches Vithalwadi Trailer:

Vithalwadi Movie Trailer Released


LATEST TELUGU NEWS


LATEST IN NEWS

POPULAR NEWSLATEST IN GALLERIES

POPULAR GALLERIES