Advertisement
Google Ads BL

జార్జి‌రెడ్డి యూత్‌కి కనెక్ట్ అయ్యాడు: దర్శకుడు


జార్జి రెడ్డి యూత్ కి కనెక్ట్ అయ్యాడు. దర్శకుడు జీవన్ రెడ్డి

Advertisement
CJ Advs

విద్యార్థి నాయకుడు జార్జిరెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన జార్జిరెడ్డి ఈ శుక్రవారం (22న) విడుదలయి సూపర్ హిట్ టాక్ ని సొంత చేసుకుంది. ఈ సందర్భంగా దర్శకుడు జీవన్ రెడ్డి, సినిమాటోగ్రాఫర్  సుధాకర్ యెక్కంటి మీడియాతో ముచ్చటించారు..

దర్శకుడు జీవన్ రెడ్డి మాట్లాడుతూ: ‘‘జార్జిరెడ్డిని తెరమీద పరిచయం చేసినందుకు నేను సంతృప్తిగా ఉన్నాను. విద్యార్ధుల నుండి, ప్రేక్షకుల నుండి వస్తున్న స్పందన నేను ఊహించిన దానికంటే చాలా బాగుంది.  జార్జిరెడ్డి పేరు ఇప్పుడు దేశంలో  వినపడుతుంది. ఆయన చరిత్ర గురించి ఒకటిన్నర సంవత్సరాలు అధ్యయనం చేసి కథను రెడీ చేసుకున్నాను. నేను కలిసిన వారందరూ  చెప్పిన కథలలో చాలా వ్యత్యాసాలు చూసాను. కలిసిన  ప్రతి ఒక్కరి దగ్గరా ఒక కథ ఉంది. అందుకే నేను నమ్మిన కథను చరిత్రలోని  వాస్తవ సంఘటనలను ఆధారంగా తీసుకొని జార్జిరెడ్డిని ప్రజెంట్ చేసాను. ఈ సినిమా  అందరికీ నచ్చుతుందని మేం మొదటి నుండి అనుకోలేదు. ఎందుకంటే జార్జిరెడ్డి కథే చాలా కాంప్లికేటడ్ దాన్ని సినిమాగా మలిచేందుకు రాసుకునే ప్రతి అక్షరం విషయంలో నేను చాలా జాగ్రత్త పడ్డాను. ఇప్పుడు వింటున్న కథలు తెరమీదకు తెస్తే మీముందు ఇక్కడ కూర్చోలేను. సినిమా కూడా బయటకు రాదు. నాలుగు రెచ్చగొట్టే సీన్స్ ను తీసి కాంట్రవర్సరీలు చేయడం నాకు ఇష్టం లేదు. మళ్ళీ ఈ సినిమా మూలంగా ఎలాంటి ఘర్షణనలు రాకూడదని జాగ్రత్త పడ్డాను.  కానీ జార్జిరెడ్డి వ్యక్తిత్వం, ఆయన నిజాయితీ  వంటి లక్షణాలతో కథను ముందుకు తీసుకెళ్లాను. జార్జిరెడ్డి కథకు హీరోలు అవసరం లేదు అని బలంగా నమ్మాను. నా స్నేహితుడు సందీప్ లో జార్జి రెడ్డిని చూసాను. ఇప్పుడు అందరికీ జార్జిరెడ్డి  సందీప్ లో  కనపడుతున్నాడు. సినిమా హాల్స్ లో వినపడుతున్న విజిల్స్ , ప్రేక్షకుల నుండి వస్తున్న స్పందన నాకు చాలా సంతృప్తి నిస్తుంది. తెరమీద జార్జిరెడ్డి కథను నిజాయితీగా చెప్పాను అనే సంతృప్తి నాకు ఉంది. ఆయన జీవితాన్ని ఇప్పటి యూత్ కి కనెక్ట్ అయ్యే విధంగా కొన్ని సన్నివేశాలను డిజైన్ చేసాను. బ్లేడ్ ఫైట్, ఫైర్ వాల్ ఫైట్ యూత్ కి విపరీతంగా నచ్చుతున్నాయి. జార్జిరెడ్డి గురించి చర్చ యూత్ లో మొదలైంది.  జార్జిరెడ్డి యూత్ కి కనెక్ట్ అయ్యాడు. అది చాలు నాకు’’ అన్నారు.

సినిమాటోగ్రాఫర్  సుధాకర్ యెక్కంటి మాట్లాడుతూ: ‘‘70 వ దశకంలో కాలాన్ని రీ క్రియేట్ చేయడంలో  సక్సెస్ అయ్యామని వస్తున్న కామెంట్స్ మాకు చాలా ఆనందాన్నిస్తున్నాయి. జార్జిరెడ్డి కథను యూత్ కి కనెక్ట్ అయ్యే విధంగా తీయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. జార్జిరెడ్డి వంటి వ్యక్తిని యూత్ కి కనెక్ట్ చేసాం అనే సంతృప్తి మాకు చాలా ఉంది. ఈ సినిమా కమర్షియల్ గా కూడా బాగా స్ట్రాంగ్ గా ఉంది. ఇలాంటి చరిత్రను తెరకెక్కించడంలో భాగం అయినందుకు చాలా సంతోషంగా ఉంది. సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు చాలా పెద్ద థ్యాంక్స్ ’’ అన్నారు.

‘దళం’ మూవీ ఫేం జీవన్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు. మైక్ మూవీస్ అధినేత అప్పిరెడ్డి.. సిల్లీమంక్స్, త్రీ లైన్స్ సినిమా బ్యానర్లతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. జార్జిరెడ్డిగా సందీప్ మాధవ్ నటించిన ఈ మూవీలో ప్రముఖ హీరో సత్య దేవ్ ఓ ప్రధాన పాత్రలో నటించాడు. ప్రముఖ మరాఠీ నటి దేవిక ‘‘జార్జి రెడ్డి’’తల్లి పాత్రలో నటిస్తుండటం విశేషం. ఇటీవల ‘నాల్’ సినిమాకు గాను బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డ్ అందుకున్న శ్రీనివాస్ పోకలే ఈ సినిమాలో చిన్ననాటి జార్జ్ రెడ్డి పాత్రను పోషించాడు. ఇతర పాత్రల్లో ముస్కాన్, మనోజ్ నందన్, చైతన్య కృష్ణ, శత్రు, వినయ్ వర్మ, తిరువీర్, అభయ్, మహాతి ఇతర నటీనటులు.

సాంకేతికవర్గానికి విషయానికి వస్తే సంగీతం -సురేష్ బొబ్బిలి, ఎడిటింగ్- ప్రతాప్ కుమార్, ఆర్ట్- గాంధీ నడికుడికార్, సినిమాటోగ్రాఫర్: : సుధాకర్ యెక్కంటి, కాస్టూమ్స్- సంజనా శ్రీనివాస్, ఫైట్స్ -గణేష్, ఆర్కే, అసిస్టెంట్ రైటర్స్- యాకుబ్ అలీ, అనిల్, స్టిల్స్ -వికాస్ సీగు, సౌండ్ డిజైన్-ఖలీష, రాహుల్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్- హర్షవర్ధన్ రామేశ్వర్,  పి ఆర్ వో: జిఎస్ కె మీడియా, కో డైరెక్టర్ -నరసింహారావు, అసోసియేటెడ్ ప్రొడ్యూసర్స్ : దాము రెడ్డి, సుధాకర్ యెక్కంటి, కో ప్రొడ్యూసర్: సంజయ్ రెడ్డి, నిర్మాత: అప్పిరెడ్డి, రచన-దర్శకత్వం- జీవన్ రెడ్డి.

Director Jeevan Reddy Talks about George Reddy Success:

Director Jeevan Reddy Press Meet for George Reddy
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs