Advertisement
Google Ads BL

జబర్దస్త్‌ షోకు గుడ్ బై.. నాగబాబు వివరణ


‘జబర్దస్త్’ కామెడీ షోపై గతంలో ఎన్నిసార్లు ఎన్ని విమర్శలు వచ్చినా.. రేటింగ్ పరంగా ఏమాత్రం తగ్గకుండా దూసుకెళుతూ వచ్చిన విషయం విదితమే. అంతేకాదు.. జబర్దస్త్ వేదికపై నుంచి చాలామంది పాపులర్ అయ్యి ఇప్పుడు ఓ వెలుగు వెలుగుతున్నారు కూడా. అయితే ఇంతటి పాపులర్ ఇప్పుడు కనుమరుగయ్యే పరిస్థితులు వచ్చాయి. ఒక్కొక్కరు కమెడియన్స్ దీన్ని వీడటం.. మరోవైపు ఈ షో జడ్జ్, మెగా బ్రదర్ నాగబాబు కూడా ఉన్నట్టుండి మాయమవ్వడంతో అసలేం జరిగింది..? ఎందుకు ఆయన తప్పుకున్నారు..? మేఘమాలకు ఆయనకు ఎక్కడ చెడింది..? ఇలా అనేక అనుమానాలు అటు జబర్దస్త్ వీక్షకులు, మెగాభిమానుల్లో ఉండిపోయాయి. మరోవైపు నాగబాబు లేని జబర్దస్త్‌ను ఊహించుకోవడం చాలా కష్టమని సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున కామెంట్స్ కూడా వచ్చాయి. అయితే ఈ మొత్తం వ్యవహారంపై స్వయంగా నాగబాబే తన యూ ట్యూబ్ చానెల్ వేదికగా స్పందించి క్లారిటీ ఇచ్చేసుకున్నారు.

Advertisement
CJ Advs

ఇదీ అసలు సంగతి..!

‘ నా లాస్ట్ షో నవంబర్-21న, 22న ప్రసారమవుతాయి. ఇకపై నేను జబర్దస్త్‌లో కనింపించను. 2013 నుంచి జబర్దస్త్‌తో నా ప్రయాణం మొదలైంది. కానీ నా అంతట నేనే జబర్దస్త్ నుంచి తప్పుకోవాల్సి వస్తుందని ఊహించలేదు. ప్రోగ్రామ్ బిజినెస్‌కు సంబంధించిన కొన్ని భేదాభిప్రాయాల వల్ల బయటికి వచ్చేస్తున్నాను. ఇందులో ఎవరినీ తప్పుబట్టడంలేదు. ఆర్థికంగా ఎంతో పతనమైన స్థితిలో జబర్దస్త్‌లోకి వచ్చాను. ఈ కార్యక్రమం కోసం నేను అందుకున్న పారితోషికం ఎంతో ఉపయోగపడింది. పారితోషికం విషయంలో తేడా వచ్చి జబర్దస్త్ నుంచి బయటికి వస్తున్నాననడం సరికాదు’ అని నాగబాబు మై చానల్ నా ఇష్టం వేదికగా ఆయన క్లారిటీ ఇచ్చుకున్నారు.

ఇదిలా ఉంటే.. నాగబాబు జబర్దస్త్ లాగా మరో ప్రత్యామ్నాయాన్ని వెతుక్కున్నారు. జీ తెలుగు చానల్‌లో కొత్త కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో గత మూడ్రోజులుగా సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్న విషయం విదితమే. అందులో నాగబాబు, అనసూయ ఇద్దరూ ప్రత్యక్షమయ్యారు. ‘సరె సర్లే ఎన్నెన్నో అనుకుంటాం.. అన్నీ జరుగుతాయా ఏంటి’ అనే కార్యక్రమం తాలూకు ప్రోమోలో మెరిసారు. కాగా ఇందులో నాగబాబుతో యాంకర్ ప్రదీప్, రవి, అనసూయ, దేత్తడి హారిక కూడా ఉన్నారు. అయితే వీరిలో ఎవరు జడ్జ్‌లు.. ఎవరు యాంకర్స్ అనే విషయం మాత్రం తెలియరాలేదు.

Nagababu: My Journey Finished in Jabardasth :

Nagababu: My Journey Finished in Jabardasth   
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs