Advertisement

పవన్, క్రిష్ సినిమాలో హీరోయిన్ ఎవరంటే?


పవన్ కళ్యాణ్ సినిమాల్లో రీఎంట్రీ ఇస్తున్నాడు ఇది ఫిక్స్ అంటూ వార్తలొస్తున్నాయి. పవన్ కళ్యాణ్.. ఏ. ఎం రత్నం నిర్మాణంలో క్రిష్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడని అంటున్నారు. మరి పవన్ కళ్యాణ్ సినిమా మొదలవుతుంది అనగానే... ఆ సినిమాపై రకరకాల ప్రచారాలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఇప్పటికే పవన్ కళ్యాణ్ రెమ్యూనరేషన్ రీఎంట్రీతో డబుల్ అయ్యిందని... పవన్ క్రేజ్ తో ఆయన అడిగింది నిర్మాత ఇస్తున్నారని అంటున్నారు. ఇక జానపద కథగా పవన్ సినిమా స్క్రిప్ట్ ని క్రిష్ ప్రిపేర్ చేశాడంటూ మరో న్యూస్.

Advertisement

తాజాగా పవన్ కళ్యాణ్ - క్రిష్ సినిమాలో పవన్ సరసన లేడి సూపర్ స్టార్ నయనతారని హీరోయిన్ గా పరిశీలిస్తున్నారని అంటున్నారు. సైరాలో చిరు సరసన సిద్దమ్మగా కొత్త లుక్ లో అదరగొట్టిన నయనతార ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా కోసం రెడీ అవుతున్నట్లు టాక్. ఇప్పటికే క్రిష్ .. నయనతారతో ఉన్న పరిచయంతో పవన్ కళ్యాణ్ కోసం ఆమెని సంప్రదించినట్లుగా చెబుతున్నారు. అయితే నయనతార గతంలో క్రిష్ కృష్ణం వందే జగద్గురుమ్ సినిమాలో నటించింది. మరి పవన్ కోసం నయనతార ఓకే చెబుతుందో...లేదంటే పవర్ స్టార్ కోసం మరో హీరోయిన్ కోసం క్రిష్ ప్రయత్నం చెయ్యాలో అనేది చూడాలి.  

Who is The Heroine in Pawan and Krish Movie?:

Pawan and Krish Waiting for Nayanathara
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement