Advertisement

‘విజిల్’ కరెక్ట్‌గా పడలా.. ఖైదీ కుమ్మేశాడు!


శుక్రవారం దీపావళి పండగ కానుకగా ప్రేక్షకుల ముందు రెండు తమిళ డబ్బింగ్ సినిమాలు పోటీ పడ్డాయి. అందులో ఒకటి స్టార్ హీరో విజయ్ విజిల్ సినిమా కాగా.. రెండోది కార్తీ ఖైదీ సినిమా. సూపర్ డూపర్ క్రేజ్ ఉన్న విజయ్ మీద కార్తీ ఎలా నెగ్గుతాడో అనుకుంటే... చివరికి ఖైదీ మీద విజిల్ కూత సరిపోలేదనేలా ఉన్నాయి విజిల్, ఖైదీ సినిమాల ఫలితాలు. విజయ్ విజిల్ కేవలం విజయ్ ఫ్యాన్స్ మెచ్చేదిలా ఉంటే.. కార్తీ ఖైదీ మాత్రం సస్పెన్స్ థ్రిల్లర్ హిట్ అనిపించుకుంది. నయనతార - విజయ్ కాంబోలో దర్శకుడు అట్లీ తెరకెక్కించిన విజిల్ సినిమాలో కథ రొటీన్ గా ఉండడం, విజయ్ హీరోయిజాన్ని ఎలివేట్ చెయ్యడం, ఫస్ట్ హాఫ్ వీక్ గా ఉండడం, సినిమా నిడివి ఎక్కువగా ఉండడం, తమిళ ఫ్లేవర్ ఎక్కువగా ఉండడంతో.. విజయ్ యాక్షన్, ఎమోషన్, సినిమాటోగ్రఫీ, కమర్షియల్ ఎలిమెంట్స్ బావున్నప్పటికీ.. విజిల్ సినిమాకి ప్రేక్షకులే కాదు, క్రిటిక్స్ కూడా యావరేజ్ టాకే ఇచ్చారు.

Advertisement

అయితే కార్తీ ఖైదీకి మాత్రం ప్రేక్షకులే కాదు, క్రిటిక్స్ కూడా హిట్ టాకిచ్చారు. సినిమాలో నాలుగు పాటలు, హీరోయిజం, హీరోయిన్ తో రొమాంటిక్ సన్నివేశాలు లాంటిది ఎక్కడా లేకపోయినా.. సినిమా థ్రిల్లింగ్ హిట్ అయ్యింది. కేవలం ఒకే నైట్ లో జరిగే కథగా తెరకెక్కించిన ఖైదీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. దర్శకుడు లోకేష్ కనకరాజ్ కథలో ఎక్కడా రాజీ పడలేదు. కేవలం రెండున్నర గంటల సినిమాని ఒక రాత్రి జరిగిన్నట్టుగా చూపించడంలో సూపర్ సక్సెస్ అయ్యాడు. ఎక్కడా బిగి సడలని రేసీ స్క్రీన్ ప్లే తో.. స్ట్రెయిట్ నరేషన్ తో రెండున్నర గంటలు ప్రేక్షకుల్ని కదలకుండా కూర్చోబెట్టి ఖైదీని ప్రత్యేకమైన సినిమాగా నిలబెట్టాడు. సామ్ సీఎస్ నేపథ్య సంగీతం, సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ సినిమాకు ప్రధాన బలాలు. మరి ఈలెక్కన తమిళనాట ఏమో కానీ.. తెలుగులో మాత్రం దివాలి హీరో ఖైదీ కార్తీ అని చెప్పొచ్చు.

Karthi Khaidi vs Vijay Whistle:

Positive Reports to Karthi Khaidi
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement