Advertisement

‘జార్జ్ రెడ్డి’ రిలీజ్ డేట్ ఫిక్సయింది


‘‘వంగవీటి’’ ఫేం సందీప్ మాధవ్  (సాండి) లీడ్ రోల్ లో నటించిన మూవీ ‘‘జార్జ్ రెడ్డి’’.. 1965 నుంచి 1975 కాలంలో హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్శిటీలో చదువుతూ.. విద్యార్థి ఉద్యమాల్లో తిరుగులేని నాయకుడుగా ఎదిగిన స్టూడెంట్ లీడర్ ‘‘జార్జ్ రెడ్డి’’  బయోపిక్ గా ఈ సినిమా తెరకెక్కింది. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ తోనే అంచనాలు పెంచిన ఈ ‘‘జార్జ్ రెడ్డి’’ సినిమా రిలీజ్ కు రెడీ అయింది. ఇప్పటికే బిజినెస్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీని నవంబర్ 22న విడుదల చేస్తున్నట్టు నిర్మాతలు తెలిపారు. ‘దళం’ మూవీ ఫేం జీవన్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు. మైక్ మూవీస్ అధినేత అప్పిరెడ్డి.. సిల్లీ మంక్స్, త్రీ లైన్స్ సినిమా బ్యానర్లతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు.

Advertisement

ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ: ‘‘కేవలం ఒక్క ట్రైలర్ తోనే మా ‘‘జార్జ్ రెడ్డి’’ చిత్రం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. బిజెనెస్ పరంగా కూడా మాకు మంచి ఆఫర్లు వచ్చాయి. చివరకు ఈ మూవీ థియేట్రికల్ రైట్స్ ను అభిషేక్ పిక్చర్స్ -అభిషేక్ నామా సొంతం చేసుకున్నారు. వారికి థాంక్స్. సినిమా మీద మంచి కాన్ఫిడెంట్ గా ఉన్నాం. ట్రైలర్ ఏ విధంగా ఇంట్రస్టింగ్ గా ఉందో.. సినిమా కూడా దానికి ఏ మాత్రం తగ్గకుండా ఉంటుంది. మా దర్శకుడు ఈ సినిమాను రియలిస్టిక్ గా తీసాడు. ఎక్కడా రాజీపడకుండా అందరం కష్టపడి ఈ సినిమా తీసాం. బయోపిక్ యే అయినా అన్ని కమర్షియల్ అంశాలు ఇందులో ఉంటాయి. అలాంటి కథ ఇది. నవంబర్ 22న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నాం. తప్పకుండా అందరికీ నచ్చేలా ఈ సినిమా ఉంటుంది’’ అన్నారు.

ప్రముఖ హీరో సత్య దేవ్ ఓ మెయిన్ రోల్ చేసిన ఈ సినిమాలో ముస్కాన్, మనోజ్ నందన్, చైతన్య కృష్ణ, శత్రు, వినయ్ వర్మ, తిరువీర్, అభయ్, మహాతి ఇతర నటీనటులు.

సాంకేతిక వర్గానికి విషయానికి వస్తే.. సంచలనాత్మక మరాఠి సినిమా ‘‘సైరాత్’’ కు ఫొటోగ్రఫీ అందించిన సుధాకర్ యెక్కంటి ఈ సినిమాకు కుడా ఫొటోగ్రఫీని అందించారు. ప్రముఖ మరాఠీ నటి దేవిక ‘‘జార్జి రెడ్డి’’ తల్లి పాత్రలో నటించటం విశేషం. ఇటీవల ‘నాల్’ సినిమాకు గాను బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డ్ అందుకున్న శ్రీనివాస్ పోకలే ఈ సినిమాలో చిన్ననాటి జార్జ్ రెడ్డి పాత్రను పోషించాడు.

సంగీతం -సురేష్ బొబ్బిలి

ఎడిటింగ్- ప్రతాప్ కుమార్

ఆర్ట్- గాంధీ నడికుడికార్

కాస్టూమ్స్- సంజనా శ్రీనివాస్

ఫైట్స్ -గణేష్, ఆర్కే

అసిస్టెంట్ రైటర్స్- యాకుబ్ అలీ, అనిల్.

స్టిల్స్ -వికాస్ సీగు

సౌండ్ డిజైన్-ఖలీష,రాహుల్

బ్యాక్ గ్రౌండ్ స్కోర్- హర్షవర్ధన్ రామేశ్వర్

పి ఆర్ వో: జి.ఎస్.కె మీడియా

కో డైరెక్టర్ -నరసింహారావు

అసోసియేటెడ్ ప్రొడ్యూసర్స్ : దాము రెడ్డి, సుధాకర్ యెక్కంటి.

కో ప్రొడ్యూసర్:సంజయ్ రెడ్డి

నిర్మాత:అప్పిరెడ్డి

రచన-దర్శకత్వం- జీవన్ రెడ్డి.

George Reddy Release Date Fixed:

George Reddy Release on Nov 22
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement