Advertisement

‘వాల్మీకి’ వివాదం.. కేంద్రానికి వైసీపీ ఎంపీ ఫిర్యాదు!


మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘వాల్మీకి’. త్వరలోనే ఈ చిత్రం మెగాభిమానులు, సినీప్రియుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా షూటింగ్ మొదలైన రోజు నుంచి ఇప్పటి వరకూ అన్నీ వివాదాలే. టైటిల్ మార్చాలని ‘వాల్మీకి’ కించపరుస్తూ సినిమా తీయడం సబబు కాదని డిమాండ్స్ ఉన్నాయి.

Advertisement

ఇక ఇవన్నీ పక్కనెడితే తాజాగ.. వైసీపీ ఎంపీ తలారి రంగయ్య రంగంలోకి దిగారు. ఈ సినిమా విషయమై కేంద్ర సమాచార.. ప్రసారాల శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్‌ను కలిసిన ఆయన.. వాల్మీకి బోయలతో పాటు హిందువుల ఆరాధ్య దైవమైన.. గొప్ప మునీశ్వరుని పేరును ఇలాంటి సినిమాలకు ఎలా వాడతారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారట. అంతేకాదు ఈ సందర్భంగా ఓ ఫిర్యాదు సైతం కేంద్రమంత్రికి ఆయన సమర్పించారు. ‘అసలు ఈ టైటిల్ వాడతారు..? గ్యాంగ్‌స్టర్‌ ఎక్కడా..? మునీశ్వరుడు ఎక్కడ..? ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోరేంటి సార్.. సెన్సార్‌ కూడా పూర్తి చేశారు. ఇప్పటికైనా సరే టైటిల్ మార్చకపోతే తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. హద్దు దాటి బోయ కులస్థులు గొడవలు చేస్తారు’ అని ఫిర్యాదులో రాసుకొచ్చారు.

అయితే వాల్మీకిపై వైసీపీ ఎంపీ చేస్తున్న పోరాటంలో ఏ మాత్రం నెగ్గుతారో మరి. ఇప్పటికే రిలీజ్ అయిన లుక్స్, టీజర్ మంచి హిట్ టాక్ తెచ్చుకున్నాయి. మరి ఈ నెల 20న సినిమా రిలీజ్ చేయాలనుకున్న చిత్రబృందం..ఈ వివాదాల నేపథ్యంలో ఎలా ముందుకెళ్తుందో..? ఫిర్యాదుపై కేంద్ర మంత్రి ఎలా రియాక్ట్ అవుతారు..? ఈ వివాదంపై దర్శకనిర్మాతలు స్పందిస్తారా లేదా..? అనే విషయాలు తెలియాల్సి ఉంది.

Valmiki tittle : Ysrcp MP Complains To I&B Minister!:

Valmiki tittle : Ysrcp MP Complains To I&B Minister!
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement