పెళ్లి కాలేదు సరే.. ఆ అజ్ఞాతవాసెవరు.. తాప్సీ!

డింపుల్ బ్యూటీ తాప్సీ..  ఎలాంటి మొహమాటం లేకుండా తనకు తోచింది మాట్లాడేస్తుంటుందన్న విషయం తెలిసిందే. అది ఇంటర్వ్యూ అయినా నార్మల్‌గా అయినా అనుకున్నది.. తన మనసులో ఉండే అభిప్రాయాలను చెప్పేస్తుంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈమెకు డింపుల్ బ్యూటీ అనడం కంటే.. స్ట్రాంగ్ లేడీ అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదేమో.

ఇక అసలు విషయానికొస్తే... గత కొన్ని రోజులుగా ఈ ముద్దుగుమ్మకు పెళ్లయిపోయిందని వార్తలు వచ్చాయి. మొదట ఈ భామ పట్టించుకోనప్పటికీ పుకార్లు మరింత పెరగడంతో రియాక్ట్ అవ్వక తప్పలేదు. బాబోయ్.. తనకు ఇంకా పెళ్ళి కాలేదు.  దయచేసి ఈ విషయంలో పుకార్లు ఆపేయండని చెప్పుకొచ్చింది.

అంతేకాదు.. మీరు అనుకుంటున్నట్లుగా తన జీవితంలో ఉండే ఆ వ్యక్తి నటుడు, క్రికెటర్, ఆసక్తిగా చూసే వృత్తిలో లేడని.. అసలు మన ఇండియాకు చెందిన వ్యక్తి కాదని.. ఆయన సమ్‌థింగ్ స్పెషల్ అంటూ చెప్పుకొచ్చిందీ భామ. ఊరూ పేరూ లేని ఆ ‘అజ్ఞాతవాసి’ ఎవరో మరి ఆమెకే తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ సినిమాల్లో తాప్సీ బిజిబిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

Taapsee pannu gives Clarity over her Marriage:

Taapsee pannu gives Clarity over her Marriage


LATEST NEWS