‘సైరా’లో తన పాత్రను రివీల్ చేసిన మిల్క్ బ్యూటీ!

మెగాస్టార్ చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్ ‘సైరా’ తెలుగు‌తో పాటు హిందీ, కన్నడ, మలయాళం, తమిళ భాషల్లో అక్టోబర్ 2 న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా ప్రమోషన్స్‌ కూడా అదే రేంజ్‌లో చేయాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. ఇప్పటికే ప్రమోషన్స్ షురూ చేసిన చిత్రబృందం.. నటీనటులు మీడియాతో చిట్ చాట్‌లు, ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.

కాగా ఈ చిత్రంలో.. లేడీ సూపర్‌స్టార్ నయనతార కథానాయికగా నటించగా, మిల్క్ బ్యూటీ తమన్నా.. ‘లక్ష్మీ’ అనే ముఖ్యమైన పాత్రలో మెరిసింది. తాజాగా తన పాత్రకు సంబంధించి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ‘సైరా’లోలో తాను ‘లక్ష్మీ’ అనే పాత్ర చేశానని.. ఇది సినీ ప్రియులకు చాలా బాగా కనెక్ట్ అవుతుందని చెప్పుకొచ్చింది. అంతేకాదు.. లక్ష్మీ పాత్ర చేయడం చాలా గర్వంగా ఉందని.. తనకు చెప్పుకోదగిన పాత్రల్లో ఇదొక్కటని మిల్క్ బ్యూటి చెప్పింది.

ఇవన్నీ ఒక ఎత్తయితే.. ఈ సినిమా హిందీ వెర్షన్‌లో మిల్క్ బ్యూటీనే డబ్బింగ్ చెప్పడం విశేషమని చెప్పుకోవచ్చు. డబ్బింక్ విషయం తనే స్వయంగా చెప్పింది. తాను నటించిన ఈ పాత్ర అద్భుతమైన అనుభూతిని ఇచ్చిందని.. అందరితో పాటు తాను కూడా సైరా రిలీజ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తమన్నా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

Tamanna reveals his role in Syra:

Actress Tamanna reveals his role in Syra


LATEST NEWS