‘సైరా’ బలం అవే: సురేందర్ రెడ్డి

మెగాస్టార్ చిరంజీవి ‘ఖైదీ నెంబర్ 150’ తర్వాత చాలా గ్యాప్‌తో సై రా సినిమాతో అక్టోబర్ 2 న ఫ్యాన్స్ నే కాదు.. యావత్ భారతాన్ని ఉర్రూతలూగించడానికి వచ్చేస్తున్నాడు. సైరా నరసింహారెడ్డిగా చిరు లుక్స్, సినిమా టీజర్, ఆ భారీ తనం అన్ని సినిమా మీద భారీ హైప్‌ని క్రియేట్ చేస్తున్నాయి. భారీ అంచనాల నడుమ విడుదల కాబోతున్న సై రా సినిమాకి రెండే రెండు బలాలు అంటూ దర్శకుడు సురేందర్ రెడ్డి చెబుతున్నాడు. ఈ సినిమాలో దాదాపుగా ఒళ్ళు గగుర్పొడిచే.. 10 యాక్షన్ సీన్స్ ఉన్నాయని.. కానీ అందులో రెండు మాత్రం సై రా నరసింహారెడ్డికి ఎంతో బలమైన సన్నివేశాలని చెబుతున్నాడు.

అన్నిటికన్నా ఎక్కువగా క్లైమాక్స్ కన్నా ముందు వచ్చే యాక్షన్ సీన్ సినిమాకే హైలెట్ అంటున్నాడు. ఆ యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను కుర్చీలకు అతుక్కుపోయేలా చేస్తాయని... సురేందర్ రెడ్డి చెబుతున్నాడు. ఇంకా ఇంటర్వెల్ బ్యాంగ్ ముందు వచ్చే యాక్షన్ సీన్ కూడా హైలెట్ అంటున్నాడు. ఈ యాక్షన్స్ సీన్‌ని అండర్ వాటర్‌లో చిత్రీకరించారని, దాని కోసం ముంబై‌లోని భారీ స్విమ్మింగ్ పూల్ ని వాడామని చెబుతున్నాడు. ఆ స్విమ్మింగ్ పూల్‌లో ఈ భారీ యాక్షన్.. వాటర్ సన్నివేశాలను చిత్రీకరించామని.. ఈ యాక్షన్ సీన్ ప్రేక్షకుడిని మునివేళ్ళ మీద నిలబెడుతుందని చెబుతున్నాడు. ఈ సినిమా కథ స్వాతంత్య్రం వచ్చిన కాలంలో ఉంది కాబట్టి.. ఆ కాలం ప్రతిబింబించేలా సెట్స్ వేసి మరీ యుద్ధ సన్నివేశాలని చిత్రీకరించినట్లుగా దర్శకుడు సురేందర్ రెడ్డి ఓ ఇంటర్వ్యూ‌లో చెప్పాడు.

Surender Reddy Reveals Sye Raa Strength :

Surender Reddy about Sye Raa Highlights


LATEST NEWS