‘కెజిఎఫ్’ తర్వాత మహేష్‌తోనా? ఎన్టీఆర్‌తోనా?

‘కెజిఎఫ్’తో ఒక్కసారిగా హైలెట్ అయిన దర్శకుడు ప్రశాంత్ నీల్.. ప్రస్తుతం ‘కెజిఎఫ్ 2’తో బిజీగా ఉన్నాడు. అయితే కెజిఎఫ్ 2 తర్వాత ప్రశాంత్ నీల్‌తో ఎన్టీఆర్ సినిమా కమిట్ అయ్యాడని... ఆ సినిమాని మైత్రి మూవీస్ నిర్మిస్తుంది అనే ప్రచారం జరిగింది. ప్రశాంత్ నీల్ ఓ స్టోరీ లైన్‌తో ఎన్టీఆర్‌ని కలిసి ఒప్పించాడనే టాక్ నడిచింది. RRR తరవాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్‌తోనే సినిమా అన్నారు. తాజాగా ఎన్టీఆర్‌తో కాదు మహేష్ బాబుతో ప్రశాంత్ నీల్ సినిమా చెయ్యబోతున్నాడంటున్నారు.

మహర్షి తర్వాత అనిల్ రావిపూడి దర్శకుడిగా ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా చేస్తున్న మహేష్ తర్వాత ప్రశాంత్ నీల్‌తోనే అంటున్నారు. ప్రశాంత్ నీల్‌తో మహేష్ సినిమా చెయ్యాలని అనుకుంటున్నాడట. అందులో నిజమెంతుందో తెలియదు కానీ.. రెండు రోజుల క్రితం ప్రశాంత్ నీల్ హైదరాబాద్ వచ్చి మహేష్ కి కథ వినిపించాడని టాక్ నడుస్తుంది. మరి అర్జున్ రెడ్డి తర్వాత సందీప్ వంగాతో మహేష్ సినిమా అన్నారు... కానీ అది సాధ్యమయ్యేలా లేదు. కానీ ఇప్పుడు కెజిఎఫ్ దర్శకుడితో మహేష్ సినిమా అంటున్నారు. ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.

Rumours on KGF director Next Film:

KGF Director Next Film with NTR or Mahesh 


LATEST NEWS