‘సైరా’ సందడి షురూ చేయాలి.. లేదంటే..?

సైరా సినిమా అక్టోబర్ 2న అంటే ఇంకా 20 రోజుల్లో విడుదల కానుంది. మరి సినిమాని ఇండియా వైడ్‌గా ఐదు భాషల్లో విడుదల చేస్తున్నారు అంటే... ఆ సినిమా ప్రమోషన్స్ ఏ రేంజ్‌లో ఉండాలి. కానీ సై రా నరసింహారెడ్డి ప్రమోషన్స్ పై వార్తలు రావడమే కానీ.. ఎక్కడా సందడి కనబడటం లేదు. తెలుగులో రాయలసీమ గడ్డ మీద సై రా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటున్నారు. ఆ ఈవెంట్ కి సై రాలో నటించిన నటులంతా హాజరవుతారు. ఇక బాలీవుడ్ లో సినిమాల విడుదలకు రెండు నెలల ముందే భారీ ప్రమోషన్స్ చేస్తారు. అసలే సై రా కి బాలీవుడ్ లో వార్ సినిమా పోటీ ఉంది. అంటే సై రా ప్రమోషన్స్ తో పిచ్చెక్కించాలి.

కానీ టీజర్ రిలీజ్ ని ముంబై లో ఘనంగా నిర్వహించిన సై రా టీం సై రా ప్రమోషన్స్ విషయాన్నీ తేలిగ్గా తీసుకుంటుందనిపిస్తుంది. మరి RRR సినిమా షూటింగ్ లో రామ్ చరణ్ బిజీగా ఉన్నప్పటికీ... చిరు, సురేందర్ రెడ్డిలు కలిసి తమన్నా, సుదీప్, విజయ్ సేతుపతిలను ఏసుకుని సై రా ప్రమోషన్స్ ని ఆయా భాషల్లో చేపడితే.. సినిమా మీద మరింత క్రేజ్ ఏర్పడుతుంది. అసలే నిన్నగాక మొన్న సాహోతో భారీ దెబ్బతిన్న ప్రేక్షకులను సై రా మీద భారీ హైప్ ఉంటేనే థియేటర్ కి వెళతారు. లేదంటే సై రా రివ్యూ చూసాక వెల్దామనుకుంటారు. తెలుగులో చిరు సినిమాకి ప్రమోషన్ తో పనిలేదు.

మెగాస్టార్ బరిలోకి దిగుతున్నాడంటే... ఆ సినిమాకి ఆటోమాటిక్ గా హైప్ వస్తుంది. కానీ తమిళ, మలయాళ, కన్నడ తో పాటుగా హిందీలో ఆ పప్పులు ఉడకవు. ఖచ్చితంగా టీం మొత్తం ప్రెస్ మీట్స్ తోనూ, ట్రైలర్ రిలీజ్ ఈవెంట్స్ తోనూ ప్రేక్షకుల ముందుకు రావాలి. లేదంటే హిందీ లో సినిమాకి క్రేజ్ రాదు. దానితో హిందీ మార్కెట్ ని భారీగా టార్గెట్ చేసినందుకు అనుభవించాల్సి వస్తుంది. సాహో కేవలం ప్రమోషన్స్ వలనే హిందీలో బ్రేక్ ఈవెన్ కి చేరుకొని లాభాల బాట పట్టింది.

No Promotions To Sye Raa:

Sye Raa Movie Team neglected Promotions 


LATEST NEWS