Advertisement

‘సాహో’: రాజమౌళి ట్వీట్ వేయలేదేంటి?


ఛత్రపతి, బాహుబలి వన్, టు సినిమాల తర్వాత ప్రభాస్ తో రాజమౌళి సన్నిహిత సంబంధం మెయింటింగ్ చేస్తున్నాడు. బాహుబలితో ఐదేళ్లు ప్రయాణం చేసిన రాజమౌళి, ప్రభాస్ లు బాగా క్లోజ్. అందుకే సాహో లైన్ విషయంలోనూ రాజమౌళి సలహాతోనే నాలుగు భాషల్లో సినిమా చేసేందుకు ప్రభాస్ మొగ్గు చూపాడనే టాక్ ఉంది. బాహుబలి తర్వాత ప్రభాస్ క్రేజ్ తో సినిమా చేస్తే హిట్ అవుతుందని.. అందుకే ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేసాడు ప్రభాస్. అయితే చాలా విషయాల్లో సలహాల కోసం ప్రభాస్, రాజమౌళి సంప్రదించాడంటున్నారు.

Advertisement

సాహో సినిమా ఫైనల్ వెర్షన్ కూడా రాజమౌళి దగ్గరుండి ఓకే చేసాడని.. సినిమా 3 గంటల నిడివి ఉన్నప్పుడు కూడా మధ్యలో కొన్ని కట్స్ చెప్పి సినిమా నిడివి కూడా రాజమౌళి ఆధ్వర్యంలోనే తగ్గించారని ప్రచారం జరుగుతుంది. అయితే సాహో సినిమా గనక హిట్ అయితే రాజమౌళి పేరు మార్మోగిపోయేదని.. సినిమా ప్లాప్ అవడంతో రాజమౌళి పేరు బయటికి రాలేదనే టాక్ ఫిలింసర్కిల్స్ లో వినబడుతుంది. ఇక సాహో విషయంలో రాజమౌళి కేర్ తీసుకున్నాడని.. అందుకే పిలవగానే సాహో ఈవెంట్ కి వచ్చాడని అంటున్నారు. కాకపోతే సాహో కి అంత సహాయం చేసిన జక్కన్న సాహో విషయంలో ఓపెన్ గా ఎలాంటి ట్వీట్ వెయ్యకుండా మౌనంగా ఉండడమే ఇప్పటికీ ఎవరికి అర్ధం కానీ విషయమే.

Rajamouli not Tweeted about Saaho:

SS Rajamouli not Promotes Prabhas Saaho
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement