‘మన్మథుడు-2’ఇక్కడ దెబ్బ.. అక్కడ పేరొచ్చింది!

ఓవర్ కాన్ఫిడెంట్‌తో ఒకే ఒక్క సినిమాతో హిట్ కొట్టిన దర్శకుడిని తీసుకొచ్చి.. మన్మధుడుకి సీక్వెల్ అంటూ.. సినిమా విడుదలకు ముందు మన్మధుడు సీక్వెల్ కాదు ‘మన్మథుడు 2’ అంటూ ప్రేక్షకులను కాస్త కన్ఫ్యూజన్‌లో పడేసిన నాగార్జున.. సినిమా విడుదలయ్యాక కూడా మా సినిమా హిట్ అంటూ సక్సెస్ మీట్ పెట్టి మరీ డబ్బా కొట్టాడు. కానీ ఫ్రైడే ఫస్ట్ షో కే యావరేజ్ టాక్ తెచ్చుకున్న ‘మన్మథుడు 2’ కి వరసగా వచ్చిన మూడు రోజుల సెలవలు కలిసొచ్చి కలెక్షన్స్ బావుంటాయని ఆశపడ్డారు. కానీ మూడు రోజుల సెలవలు కూడా ‘మన్మథుడు 2’ ని కాపాడలేకపోయాయి. ‘మన్మథుడు 2’ కి యావరేజ్ టాక్ దెబ్బేసింది. కాబట్టే మూడు రోజుల సెలవుల్లోనూ సో సో కలెక్షన్స్ వచ్చాయి. వరల్డ్ వైడ్‌గా ‘మన్మథుడు 2’ కి మొదటి నాలుగు రోజుల్లో కేవలం 8.86 కోట్లు కొల్లగొట్టింది. ఇది నాగార్జున క్రేజ్‌కి అస్సలు ఏమాత్రం మ్యాచ్ కాని ఫిగర్.

ఇక నిన్న మంగళవారం ‘మన్మథుడు 2’ కలెక్షన్స్ బొత్తిగా పడిపోయాయి. వీక్ డేస్ వర్కింగ్ డే కావడంతో మంగళవారం ‘మన్మథుడు 2’ థియేటర్స్ లో ప్రేక్షకులు బొత్తిగా కరువయ్యారు. మరి ఆఫీసర్ తో డిజాస్టర్ కొట్టిన నాగార్జున, దేవదాస్ తో పర్వాలేదనిపించినా.... ఇక ఎంతో నమ్మి పెట్టుబడి పెట్టి మరీ హీరో గా నటించిన మన్మధుడు 2 కూడా నాగార్జున కి ఝలక్ ఇచ్చింది. ఇక ప్రస్తుతం ఈ ప్లాప్స్ లో సతమతమవుతున్న నాగార్జున అటు బిగ్ బాస్ సీజన్ 3 హోస్ట్ గా మాత్రం ఇరగదీసేస్తున్నాడు. బిగ్ బాస్ హోస్ట్ గా నాగ్ చేస్తున్న యాంకరింగ్ వలెనే బిగ్ బాస్సీజన్ 3 ని ఇషపడే ప్రేక్షకులు పెరిగారు. లేదంటే షో మొదలైనప్పుడు అస్సలు క్రేజ్ లేని బిగ్ బాస్ షో.... ఇప్పుడు 23 రోజులు గడిచేసరికి బుల్లితెర ప్రేక్షకుల అభిమానం చూసారగొంటుంది అంటే అది కేవలం హోస్ట్ నాగ వల్లే అంటున్నారు అభిమానులు.

Manmadhudu 2 here flop.. but:

Manmadhudu 2 here flop.. but


LATEST NEWS