విజయశాంతి కాలేజ్‌లో ఏం చేస్తోంది!!

మహేష్ బాబు - అనిల్ రావిపూడి కాంబోలో జెట్ స్పీడు గా తెరకెక్కుతున్న సరిలేరు నీకేవారు సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతుంది. నిన్నటివరకు అన్నపూర్ణ స్టూడియోస్ లో వేసిన స్పెషల్ ట్రైన్ సెట్ లో షూటింగ్ చేసిన ‘సరిలేరు నీకెవ్వరు’ టీం.. ప్రస్తతం నల్సార్ లా యూనివర్సిటీలో షూటింగ్ చిత్రీకరణ జరుపుతుంది. ఇప్పటికే సినిమా ఇంటర్వెల్‌కి ముందు వచ్చే సినిమా షూటింగ్‌ని దాదాపుగా కొన్ని సీన్స్ మిన్నగా అనిల్ రావిపూడి పూర్తి చేసాడంటున్నారు. ఇక ఈ సినిమాలో రష్మిక మొదటిసారి మహేష్‌తో జోడీకడుతుంటే.. విజయశాంతి, బండ్ల గణేష్ లాంటి సీనియర్ నటులు ఈ సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇస్తున్నారు.

ఇకపోతే ఆగష్టు తొమ్మిదిన మహేష్ బర్త్ డే రోజున మహేష్ లుక్‌ని రివీల్ చేసింది మూవీ టీం. ఆర్మీ ఆఫీసర్ లుక్‌లో మహేష్ అదరగొట్టేసాడు. కేవలం మహేష్ అభిమానులకే కాదు.. అందరిని మహేష్ లుక్ ఇంప్రెస్స్ చేసింది. ఇకపోతే ఈ సినిమాలో విజయశాంతి ఓ కీ రోల్ ప్లే చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా సెట్‌లో అడుగుపెట్టిన విజయశాంతి ఈ సినిమాలో ఒక ప్రొఫెసర్ పాత్రలో కనిపించబోతుందని.. అందుకే చిత్ర బృందం అంతా ప్రస్తుతం హైదరాబాద్‌లోని నల్సార్ లా యూనివర్సిటీలో షూటింగ్ చిత్రీకరణ చేస్తున్నట్టుగా టాక్. ఈ యూనివర్సిటీ సన్నివేశాల తర్వాత ‘సరిలేరు నీకెవ్వరు’ టీం రామోజీ ఫిలిం సిటీకి షిఫ్ట్ అవుతుంది. మహేష్ - రష్మికల ఈ సరిలేరు నీకెవ్వరూ సినిమాని 2020 సంక్రాతి కానుకగా విడుదలకు డేట్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

vijayashanthi role revealed in sarileru neekevvaru:

vijayashanthi role revealed in sarileru neekevvaru


LATEST NEWS