‘సాహో’కి యుఎస్‌లో దెబ్బపడనుందా?

ప్రపంచ వ్యాప్తంగా ప్రభాస్ నటించిన సాహో చిత్రం ఆగస్టు 30 న రిలీజ్ అవుతుంది. అయితే యూఎస్ లో ఒక రోజు ముందుగానే రిలీజ్ అవుతుంది. అంటే ప్రీమియర్ షో ద్వారా ఒక రోజు ముందే రిలీజ్ చేయాలనీ నిర్ణయించుకున్నారు మేకర్స్. పైగా ప్రభాస్ కి యూఎస్ మార్కెట్ ఎక్కువ. అందుకే ప్రభాస్ క్రేజ్ దృష్టిలో పెట్టుకుని అక్కడ డిస్ట్రిబ్యూటర్ ఈ సినిమా యొక్క ప్రీమియర్ షో వేసి భారీ మొత్తంలో వసూళ్లు చేద్దాం అని ఆలోచించారు. 

కానీ కొన్ని కారణాలు వల్ల సాహో యూఎస్ ప్రీమియర్ షోస్ ను క్యాన్సల్ చేశారట మేకర్స్. కారణాలు ఏంటో తెలియదు కానీ ముందు నుంచీ ప్లాన్ చేసుకున్న డిస్ట్రిబ్యూటర్లు ప్రస్తుతం ఏమి అర్ధంకాక అయోమయ స్థితిలో ఉన్నారట. ఈసినిమా యొక్క రైట్స్ ఎవరు ఊహించని విధంగా భారీ మొత్తంలో డిస్ట్రిబ్యూటర్లు కొనుకోలు చేశారు. ప్రీమియర్స్ ద్వారా ఎంతో కొంత లాగుదాం అని అనుకున్నారు కానీ చివరి నిమిషంలో మేకర్స్ హ్యాండ్ ఇచ్చారు. ప్రీమియర్ షోస్ పడకపోయినా డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన అమౌంట్ కంటే ఎక్కువే వస్తోందని అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. కేవలం ప్రీమియర్ షోస్ రద్దు అవ్వడం వల్లే సాహో డిస్ట్రిబ్యూటర్స్ పది కోట్లు మేరకు నష్టం వాటిల్లే అవకాశాలు ఉన్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో అయితే సాహో కి ఉన్న క్రేజ్ అంత ఇంత కాదు. పైగా ట్రైలర్ చాలా బాగుండంతో ఫ్యాన్స్ అసలు ఆగడంలేదు.

Saaho Premiere Shows Cancelled in US:

Bad News to Saaho Makers


LATEST NEWS