ఈ వారం బాక్సాఫీస్ చతికిలపడింది

పోయిన శుక్రవారం రాక్షసుడు, గుణ 369 సినిమాలు విడుదలైతే... అందులో రాక్షసుడికి హిట్ టాక్ రాగా.. గుణ 369 కి ప్లాప్ టాక్ పడింది. బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన రాక్షసుడు సినిమాకి హిట్ టాక్ పడినప్పటికీ.. ఆ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించేందుకు నానా తంటాలు పడుతుంది. ఎందుకంటే మొదటి వారంలో కేవలం 8 కోట్లకు మాత్రమే రాక్షసుడు రాబట్టింది. ఇక సినిమా విడుదలైన 10 రోజులకి బెల్లంకొండ రాక్షసుడు సక్సెస్ మీట్ కూడా పెట్టాడు. ఇక గుణ 369 విడుదలైన రోజున మాత్రమే హంగామా కనిపించింది. కానీ విడుదలయ్యాక గుణ టీం ఎవ్వరికి కనబడలేదు. ఇక తాజాగా ఈ శుక్రవారం మన్మథుడు 2, కథనం, కొబ్బరి మట్ట సినిమాలు విడుదలయ్యాయి.

నాగార్జున - రకుల్ ప్రీత్ నటించిన మన్మథుడు 2 సినిమాకి యావరేజ్ టాక్ రాగా.. ఆ సినిమాకి మంచి ఓపెనింగ్స్ అయితే వచ్చాయి. నాగ్ క్రేజ్ తో మన్మథుడు 2 కి మొదటి మూడు రోజులు చెప్పుకోదగ్గ కలెక్షన్స్ వచ్చినప్పటికీ... తర్వాత కలెక్షన్స్ డ్రాప్ అవడం ఖాయంగా కనబడుతుంది. ఇక మరో రెండు రోజుల్లో శర్వానంద్ రణరంగం, అడవి శేష్ ల ఎవరు సినిమాలొచ్చేస్తున్నాయి. ఇక అనసూయ కీలక పాత్రలో నటించిన కథనం సినిమాకి ప్లాప్ టాక్ పడింది. అయితే ఈ సినిమా కేవలం డబ్బు కోసమే అనసూయ చేసిందంటూ సోషల్ మీడియాలో నెటిజెన్స్ రోల్ చేస్తున్నారు. మరి 12 కథలను రిజెక్ట్ చేసిన అనసూయ ఇలాంటి సినిమా ఎందుకు చేస్తుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

ఇక సంపూర్ణేష్ బాబు నటించిన కొబ్బరి మట్ట సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది. ఎట్టకేలకు ఈ శనివారం విడుదలైన సంపూ కొబ్బరి మట్ట సినిమాకి యావరేజ్ కాదు ప్లాప్ కాదు.. అట్టర్ ప్లాప్ టాక్ పడింది. కేవలం సంపూ అభిమానులకే అంటూ రివ్యూ రైటర్స్ ఓ టాగ్ కూడా ఇచ్చారు. మరి యావరేజ్ టాక్ తో కలెక్షన్స్ తో పర్వాలేదనిపిస్తున్న మన్మథుడు 2 కి, కథనం, కొబ్బరి మట్ట లు ఎలాంటి పోటీ ఇవ్వలేకపోయాయి. అయితే మన్మథుడు 2 కి బ్రేక్ ఈవెన్ రావడం మాత్రం కాస్త కష్టమే అంటున్నాయి ట్రేడ్ నిపుణులు.

No Hit Movie in this Week at Box Office:

Manmadhudu, Kathanam, Kobbarimatta Result at Box Office


LATEST NEWS