13 ఏళ్ల తర్వాత విజయశాంతి మేకప్ వేసిందోచ్!

టాలీవుడ్‌లో లేడీ సూపర్ స్టార్‌గా పేరుగాంచిన విజయశాంతి అలియాస్ రాములమ్మ సినిమాలకు గుడ్ బై చెప్పి రాజకీయాల్లోకి వెళ్లిన సంగతి విదితమే. సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక మందన్నా నటీనటులుగా వరుస విజయాల దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’తో రాములమ్మ రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఒకట్రెండు కాదు ఏకంగా పదమూడేళ్ల గ్యాప్ తర్వాత విజయశాంతి రంగంలోకి దిగుతున్నారు. 

రీ ఎంట్రీ కూడా సూపర్ స్టార్ సినిమాతో కావడంతో కీలక పాత్రే ఇవ్వడం విశేషమని చెప్పుకోవచ్చు. అయితే ఈ పాత్ర నెగిటివ్ గా ఉంటుందని టాక్ నడుస్తోంది. ఇప్పటికే ‘సరిలేరు నీకెవ్వరు’ షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకోగా.. సెకండ్ షెడ్యూల్ హైదరాబాద్‌లో షురూ అయ్యింది. ఈ సెకండ్ షెడ్యూల్‌లో రాములమ్మ, రష్మిక ఇద్దరితోనే ఎక్కువ సన్నివేశాలు ఉంటాయని తెలుస్తోంది. రాములమ్మమ షూటింగ్‌లో దిగారంటూ డైరెక్టర్ అనిల్ రావిపూడి ట్విట్టర్ ద్వారా చెప్పుకొచ్చారు.

‘13 ఏళ్ల తర్వాత విజయశాంతి గారు మళ్లీ మేకప్ వేసుకున్నారు. 13 ఏళ్లకు ముందు ఇప్పటికీ ఆమె పెద్దగా ఏమీ మారలేదు. అదే క్రమశిక్షణ, అదే దృక్పథం, అదే డైనమిజమ్ ఆమెలో అలానే ఉంది. విజయశాంతి గారికి వెల్‌కమ్" అని అద్దం ముందు రాములమ్మ ఉన్న ఓ ఫొటోను తన ట్విట్టర్‌లో అనిల్ రావిపూడి చెప్పుకొచ్చారు. మరి ఈమె పాత్ర ఏంటి..? అప్పటికీ ఇప్పటికీ విజయశాంతిలో వేరియేషన్ ఉందా..? లేదా అనేది వచ్చే ఏడాది సంక్రాంతికి సినీ ప్రియులు డిసైడ్ చేస్తారన్న మాట.

Vijayashanti starts shooting for Sarileru Neekevvaru:

Vijayashanti starts shooting for Sarileru Neekevvaru  


LATEST NEWS