బిగ్‌బాస్-3‌ గెస్సింగ్ లిస్టే కన్ఫామ్ అయ్యిందిగా..

తెలుగు బుల్లితెరపై అతిపెద్ద రియాల్టీ షోగా పేరుగాంచిన బిగ్‌బాస్ మూడో సీజన్ అనుకున్న టైమ్‌కే ఘనంగా ప్రారంభమైంది. ఈ షో ఎన్నో వివాదాల మధ్య ప్రారంభమైంది. 100 రోజుల నడవనున్న ఈ షో ఆదివారం రాత్రి సరిగ్గా 9:00 గంటలకు స్టార్ట్ అయ్యింది. బిగ్‌బాస్ హోస్ట్‌గా నాగార్జున తనదైన కింగ్ స్టైయిల్‌లో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మొదట ముగ్గురు కంటెస్టెంట్లను మాత్రమే పరిచయం చేసిన నాగ్.. ఆ తర్వాత మిగిలిన 12 మందిని కాసింత గ్యాప్‌లో హౌస్‌లోకి రప్పించారు.

హౌస్‌లోకి అడుగుపెట్టిన వారు వరుసగా..

01.. శివజ్యోతి (తీన్మార్ సావిత్రి)

02.. రవికృష్ణ (సీరియల్ ఆర్టిస్ట్)

03.. ఆశు రెడ్డి (డబ్ స్మాష్ ఆర్టిస్ట్)

04.. జాఫర్ (టీవీ9 యాంకర్)

05.. హిమజ (టీవీ నటి)

06.. రాహుల్ సిప్లిగంజ్ (గాయకుడు)

07..రోహిణి (టీవీ నటి)

08.. బాబా భాస్కర్ (కొరియోగ్రాఫర్)

09.. పునర్నవి భూపాలం (నటి)

10.. హేమ (నటి)

11.. అలీ రజా (టీవీ నటుడు)

12.. మహేశ్ (కామెడీ ఆర్టిస్ట్)

13.. శ్రీముఖి (యాంకర్)

14.. వరుణ్ సందేశ్ (నటుడు)

15.. వితికా షేరు (వరుణ్ సందేశ్ సతీమణి)

కాగా.. వీరిలో ఒకరిద్దరు తప్ప చాలా వరకు కంటెస్టెంట్లను కొత్తగా పరిచయం చేయనక్కర్లేదు. ఇదిలా ఉంటే.. బిగ్‌బాస్ షో ప్రారంభం అవుతుందా..? లేదా..? అని ఆఖరి నిమిషం వరకు టెన్షన్ టెన్షన్‌గానే ఉన్నది. అయితే భారీ భద్రత నడుమ షెడ్యూల్ ప్రకారమే ప్రారంభం కావడంతో షో జరుగుతుందా లేదా అన్న అనుమానాలు పటాపంచలయ్యాయి. కాగా.. ఈ షోపై పలు వివాదాలు తలెత్తిన విషయం విదితమే.

Bigg Boss Telugu Season 3: 15 Contestants List:

Bigg Boss Telugu Season 3: 15 Contestants List


LATEST NEWS