‘రణరంగం’లోని ‘కన్నుకొట్టి’ పాట విడుదల

శర్వానంద్, కాజల్, కళ్యాణి ప్రియదర్శిని ల కాంబినేషన్ లో సుధీర్ వర్మ దర్శకత్వంలో  సితార ఎంటర్ టైన్మెంట్స్ చిత్రం ‘రణరంగం’లోని ‘కన్నుకొట్టి’  పాట విడుదల 

యువ కథానాయకుడు శర్వానంద్, కాజల్, కళ్యాణి ప్రియదర్శినిల కాంబినేషన్ లో ప్రముఖ దర్శకుడు సుధీర్ వర్మ దర్శకత్వంలో, ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం ‘రణరంగం’ ఆగస్టు 15 న విడుదల కానున్న విషయం విదితమే.

ఈ చిత్రానికి సంబంధించిన రెండవ పాటను ఈ రోజు విడుదల చేశారు. ‘కన్ను కొట్టి చూసేనంట సుందరి... మనసు మీటి వెళ్లే నంట మనోహరి’ అనే పల్లవి గల ఈ గీతాన్ని గీత రచయిత కృష్ణ చైతన్య రచించగా, చిత్ర సంగీత దర్శకుడు కార్తీక్ రాడ్రి గ్రూజ్ ఆలపించారు. కథానాయకుడు శర్వానంద్, కల్యాణి ప్రియదర్శినిలపై ఈ గీతాన్ని చిత్రీకరించారు. కథ పరంగా శర్వానంద్, ప్రియదర్శినిల మధ్య ఉన్న ప్రేమకు చక్కని వెండితెర రూపం ఈ పాట. కార్తీక్ గళం ఈ పాటకు మరింత కొత్త ధనాన్ని అందించింది. ఆదిత్య మ్యూజిక్ కంపెనీ ద్వారా ఈ చిత్రం ఆడియో విడుదల అవుతుంది. చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు ముగింపు దశలో ఉన్న ఈ చిత్రాన్ని ఆగస్టు 15, 2019 న విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ తెలిపారు. 

ఈ చిత్రానికి మాటలు: అర్జున్ - కార్తీక్, సంగీతం : ప్రశాంత్ పిళ్ళై , ఛాయాగ్రహణం : దివాకర్ మణి, పాటలు: రామజోగయ్య శాస్త్రి, కృష్ణ చైతన్య, ఎడిటర్: నవీన్ నూలి,  ప్రొడక్షన్ డిజైనర్: రవీందర్, పోరాటాలు: వెంకట్, నృత్యాలు: బృంద, శోభి, శేఖర్, ప్రొడక్షన్ కంట్రోలర్: సి.హెచ్. రామకృష్ణారెడ్డి, సమర్పణ: పి.డి.వి.ప్రసాద్, నిర్మాత: సూర్యదేవర నాగవంశీ, రచన-దర్శకత్వం: సుధీర్ వర్మ 

Kannukotti song Released from Ranarangam Movie:

Ranarangam Movie Second Song Released


LATEST NEWS